Homemade Nut Powder for Good Health: ఆరోగ్యంగా ఉండటం అందరికీ అవసరమే. అలా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సరిపడా నిద్ర పోవాలి. శారీరక శ్రమ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే.. పలు కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందులో వెన్ను నొప్పి కూడా ఒకటి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. అలాంటి సమయంలో ఈ పౌడర్ ఒక్క చెంచా తీసుకుంటే వెన్ను నొప్పితో పాటు.. ఇతర ఆరోగ్య సమస్యలూ పటాపంచలవుతాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆపౌడర్ ఎలా తయారు చేసుకోవాలి? ఆ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఈ స్టోరీలో చూద్దాం..
పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
పల్లీలు: పల్లీల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో మోనో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తాయి. అలాగే ఇందులో విటమిన్స్ ఇ, బి1, బి3, బి9, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
నవారారైస్: వీటినే రెడ్ రైస్ అంటారు. నవరా వరిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా వాడతారు. ఇందులో కాల్షియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
బెల్లం: చక్కెరతో పోలిస్తే బెల్లం హెల్దీ స్వీటెనర్. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్సన్స్‌తో పోరాడేందుకు సహాయపడతాయి.
నువ్వులు: నువ్వుల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వుల్లో ఒమేగా 6, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్స్ బి, ఇ లు ఉన్నాయి. వీటితో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
కొబ్బరి: కొబ్బరిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి , మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలంటే:
- ముందుగా బియ్యం, నువ్వులు, పల్లీలు విడివిడిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇవి చల్లారిన తర్వాత మిక్సీజార్లోని తీసుకుని అందులోకి బెల్లం, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకవాలి.
- ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుని రోజుకు ఓ చెంచా చొప్పున తీసుకోవాలి.
ఈ పౌడర్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: పల్లీల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో, అలాగే మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే రెడ్రైస్లోని ఫైబర్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
జీర్ణక్రియ: పల్లీలు, రెడ్రైస్లోని ఫైబర్.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని.. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుందట.
రోగనిరోధక శక్తి: నువ్వులు, బెల్లం, కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని.. జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడటానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఎముకల ఆరోగ్యం: నువ్వులు, బెల్లం, కొబ్బరిలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకలు అరిగిపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
2012లో "Journal of Nutrition"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా నువ్వులు తినే వ్యక్తులలో ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం 30% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్సిటీలో ఎపిడిమియోలజీ ప్రొఫెసర్ డాక్టర్ Dr. Li-Qiang Wang పాల్గొన్నారు. నువ్వులలోని కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వారు పేర్కొన్నారు.
చర్మం, జుట్టు ఆరోగ్యం: నువ్వులు, బెల్లం, కొబ్బరిలోని విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైనవి.. పలు రకాల చర్మ సమస్యలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. అలాగే జుట్టు రాలే సమస్యల్ని కూడా తగ్గించి.. కొత్త జుట్టు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఉప్పు నీటి స్నానంతో వెన్ను నొప్పి తగ్గుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
తరచుగా నడుము నొప్పి వేధిస్తోందా? - ఈ వ్యాయామాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు!