ETV Bharat / health

గుడ్ ఐడియా : అవాంఛిత రోమాలకు వ్యాక్సింగ్‌ అవసరం లేదు - ఈ నేచురల్​ టిప్స్‌తో ఈజీగా తొలగించుకోండి! - How To Remove Facial Hair - HOW TO REMOVE FACIAL HAIR

Tips To Remove Facial Hair Naturally : ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా.. అవాంఛిత రోమాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల పెదవిపై, చెంపలకు పక్కన వెంట్రుకలు పెరగడంతో నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీంతో.. నొప్పిగా ఉన్నప్పటికీ వ్యాక్స్ చేయించుకుంటారు. అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల నేచురల్​గా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Remove Facial Hair
Tips To Remove Facial Hair Naturally (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 12:00 PM IST

Updated : Jun 23, 2024, 12:13 PM IST

Home Remedies To Remove Facial Hair : ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే.. చాలా మంది వీటిని తొలగించడానికి వ్యాక్సింగ్‌ పద్ధతిని అనుసరిస్తుంటారు. కానీ.. వ్యాక్సింగ్‌ చేసుకోవడం వల్ల కొందరిలో అలర్జీ, చర్మం ఎర్రగా మారడం, దురద, నొప్పి కలగడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల నాచురల్‌గా ఫేషియల్ హెయిర్‌ను రిమూవ్‌ చేసుకోవచ్చని నిపుణులంటున్నారు. ఆ టిప్స్‌ ఏంటో చూద్దాం పదండి..!

చక్కెర, నిమ్మరసం :
ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. 10 టేబుల్‌స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఫేస్‌పైన హెయిర్‌ ఉన్నచోట అప్లై చేసుకుని.. 30 నిమిషాల తర్వాత గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి.

కార్న్‌స్టార్చ్‌తో :
రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని.. దానికి టేబుల్‌స్పూన్‌ తేనె యాడ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది. తర్వాత వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్‌ అప్లై చేసుకొని.. చల్లారిన చక్కెర మిశ్రమాన్ని హెయిర్‌ మొలిచే దిశలో అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒక కాటన్‌ క్లాత్‌ సహాయంతో గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి.

ఇంట్రస్టింగ్ : ఈ చిన్న టిప్స్​ పాటిస్తే చాలు - జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది!

అరటిపండు, ఓట్‌మీల్‌తో :

ముందుగా బాగా పండిన అరటిపండును రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌తో కలిపి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేసి.. 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.

పసుపు పేస్ట్ :
ఒక గిన్నె​లో కాస్త పసుపు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ లేదా పాలు యాడ్ చేసుకొని పేస్ట్​లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు ఉన్న చోట సున్నితంగా రుద్దుతూ అప్లై చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్​తో ముఖాన్ని కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2017లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పసుపు సంబంధిత ప్యాక్‌లు అవాంఛిత రోమాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో దిల్లీలోని జామియా హమ్​దార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు 'డాక్టర్ అమిత్ సింగ్' పాల్గొన్నారు. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కర్కుమిన్ అనే పదార్థం అవాంఛిత రోమాలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

శనగపప్పు :
ఒక గిన్నె​లో టేబుల్‌స్పూన్‌ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి 5 టేబుల్‌స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలి. అలాగే మరొక వైపు రాత్రంతా నానబెట్టిన శనగపప్పును పేస్ట్‌ చేసుకోవాలి. ఈ రెండింటినీ కలుపుకొని అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ ​: పురుషుల కంటే మహిళల్లోనే ఆందోళన ఎక్కువ! - కారణాలు ఇవే!

మీ అత్తగారు చిరాకుపడుతున్నారా? - కోడలిగా మీరు ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​!

Last Updated : Jun 23, 2024, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.