ETV Bharat / health

చర్మంపై దద్దుర్లు వేధిస్తున్నాయా? - ఈ రెమెడీస్​తో ఆల్ సెట్ ! - Home Remedies for Skin Allergy - HOME REMEDIES FOR SKIN ALLERGY

Skin Allergy: మీకు స్కిన్​ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదా? అయితే నో టెన్షన్​. ఇంటి చిట్కాలతో స్కిల్‌ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Skin Allergy
Home Remedies for Skin Allergy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 6:54 PM IST

Home Remedies for Skin Allergy: ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ కామన్​ అయ్యింది. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు కొన్ని ఆహార పదార్థాల వల్ల, క్రీమ్స్‌ కారణంగా, ఆర్టిఫిషియల్ నగల వల్ల చర్మం అలర్జీకి గురవుతుంది. ఈ కారణంతో స్కిన్​పై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ముఖం, శరీరంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. అయితే కొన్ని అలర్జీలు మామూలుగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. స్కిన్​ అలర్జీలతో బాధపడేవారు ఇంటిలో లభించే కొన్ని పదార్థాలతో తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వేప: వేప అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున, ఇది చర్మ అలెర్జీలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి వేప నూనెను అలర్జీ ఉన్న ప్రదేశంలో రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత నార్మల్​ వాటర్​తో శుభ్రం చేసుకోవాలి. వేప నూనెను ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా చర్మ అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

2012లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అటోపిక్ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న పిల్లలకు వేప నూనె రాయడం వల్ల దురద, వాపు, ఎరుపుదనం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మద్రాస్ మెడికల్ కళాశాలలో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్​ ఎం. శివరాజ్ పాల్గొన్నారు. వేపనూనె స్కిన్​ అలర్జీలను తగ్గించడమే కాకుండా చర్మం మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

చపాతీలు కాసేపటికే గట్టిపడుతున్నాయా? - ఇలా చేస్తే ఎన్ని గంటలైనా మృదువుగా, ఫ్రెష్‌గా ఉంటాయి! - How to Make Soft Chapati

తులసి: తులసి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్కిన్​ అలర్జీలను నయం చేయడంలో తులసి పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను తీసుకొని పేస్ట్ చేసి.. దద్దుర్లు, దురద ఉన్న ప్లేస్​లో పేస్ట్‌ను అప్లై చేయమని. ఓ 15 నిమిషాల తర్వాత క్లీన్​ చేసుకుంటే సరి అంటున్నారు.

టీ ట్రీ ఆయిల్​: టీ ట్రీ ఆయిల్ స్కిన్ అలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉందని.. అనేక రకాల చర్మ అలర్జీల నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు. అలాగే చర్మం ఎరుపు, దురదను తొలగించడానికి ఇది సాయపడుతుందంటున్నారు.

ఆలివ్ ఆయిల్​: ఆలివ్ ఆయిల్ చర్మంపై అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ E సమృద్ధిగా ఉన్న ఆలివ్ ఆయిల్ అలర్జీ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. చర్మాన్ని నయం చేస్తుందని అంటున్నారు.

అలోవెరా: అలోవెరా చర్మానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ అలర్జీలను దూరం చేయడంలో సహాయపడతాయని అంటున్నారు. అలర్జీలు ఉన్న ప్లేస్​లో కలబంద జెల్‌ను అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత క్లీన్​ చేసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు.

చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా? - Is Sweating Good Or Bad For Skin

యాపిల్ సిడర్ వెనిగర్​: యాపిల్ సిడర్ వెనిగర్ శరీరంలోని అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అలర్జీలను తొలగిస్తాయని అంటున్నారు. అందుకోసం ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలపి.. ఈ మిశ్రమాన్ని అలర్జీ ఉన్న చోట రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె చర్మానికి పోషణను అందించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అలర్జీ ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను సున్నితంగా అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలని.. ఆ తరువాత, నీటితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, మంట, దురద నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్​: నోరు తెరిచి నిద్ర పోతున్నారా? - ఈ ప్రాణాంతక సమస్యలు ఎటాక్​ చేయడం గ్యారెంటీ! - Mouth Breathing Side Effects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.