ETV Bharat / health

షాకింగ్ : కారు సీటుతో సంతాన సామర్థ్యానికి దెబ్బ - పిల్లలు పుట్టరా? - Side effects of heated car seats

Heated Car Seats Effects on Men Fertility: కారు సీటుకు పిల్లలు పుట్టకపోవడానికి మధ్య రిలేషన్ ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే అంటున్నారు నిపుణులు! అవును.. కారు ఎక్కువగా నడిపేవారిలో సంతాన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందట! ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Heated Car Seats Effects on Men Fertility

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 11:54 AM IST

Heated Car Seats Effects on Men Fertility : నగరాల్లో నివసించే వారిలో దాదాపుగా ప్రతి ఒక్కరికి కార్లు, బైక్​లు ఉన్నాయి. దగ్గరి ప్రయాణాల నుంచి దూరం ప్రయాణాల వరకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువ సేపు డ్రైవింగ్​ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. పురుషుల విషయానికి వస్తే.. ఏకంగా సంతానోత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

కొన్ని పరిశోధనల ప్రకారం.. ఎక్కువసేపు డ్రైవింగ్​ సీట్లో కూర్చోవడం వల్ల.. ఊబకాయం, గుండె పోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఈ వ్యాధులే కాకుండా.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో వాపులు మొదలవుతాయి. అంతేకాకుండా కాళ్లలో రక్తం గడ్డకట్టడం కూడా జరుగుతుందట. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే మరొక సాధారణ సమస్య వెన్నునొప్పి. ఇవన్నీ చాలా మందికి తెలుసు. కానీ.. పురుషుల్లో స్పెర్మ్​ ఉత్పత్తి తగ్గుతుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. జర్మనీలోని గిస్సెన్​ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు.

Male Contraceptive ICMR : పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్.. ట్రయల్స్ సక్సెస్! 99% మెరుగైన పనితీరు

ఆరోగ్యకరమైన స్పెర్మ్​ ఉత్పత్తి కావడానికి.. పురుషుల వృషణాల వద్ద వాతావరణం చల్లగా ఉండాలి. హెల్దీ స్పెర్మ్ కోసం.. 35 లేదా 36 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత మించ కూడదు. అంతకుమించి వృషణాలు వేడికి గురైతే.. సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరి.. దీనికీ కారు సీటుకు సంబంధం ఏమంటే.. సీట్ల తయారీ కోసం వినియోగించే రెగ్జిన్, ఇతర పదార్థాలు ఎక్కువ వేడిని పుట్టిస్తాయి. ఇలాంటి సీట్ల మీద ఎక్కువ సేపు కూర్చుంటే.. గాలి ఆడకపోవడం వల్ల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వృషణాల మీద ఎఫెక్ట్ చూపుతుందని.. అంతిమంగా వీర్యకణాల మీద పడుతుందని చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకునేందుకు పరిశోధకులు.. 30 మంది పురుషుల స్క్రోటమ్​(వృషణాలు)లకు టెంపరేచర్​ సెన్సార్​లను అమర్చగా.. ఒక్కొక్కరు గంటన్నర సేపు కార్లలోని సీట్లపై కూర్చున్నారు. ఒక గంటలో స్క్రోటల్​ టెంపరేచర్​ సగటున 37.3 డిగ్రీల సెల్సియస్​కు పెరగగా.. ఒక వ్యక్తిలో గరిష్ఠంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. అదే నార్మల్​ సీట్లపై కూర్చుంటే ఉష్ణోగ్రత 36.7 డిగ్రీల సెల్సియస్​కు చేరిందని వారు తెలిపారు. అధిక వేడి పుట్టించే సీట్లపై కూర్చోవడం నిరంతరంగా కొనసాగితే.. స్మెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతోపాటు దీర్ఘకాలంలో అంగస్తంభన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పరిశోధనలు - వివరాలు..

2019లో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి కారు సీట్లలో కూర్చోవడం వల్ల పురుషులలో వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించి, ఫలదీకరణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

2020లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం.. వేడి చేసే కారు సీట్లను వాడడం వల్ల చర్మం పొడిబారిపోవడం, దురద పుట్టడం, మంటలు రావడం వంటి సమస్యలు వస్తాయని తేల్చింది.

2021లో జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి చేసే కారు సీట్లను వాడడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందట.

పురుషులు రోజుకు చెప్పే అబద్ధాలు ఎన్నో తెలుసా?

పురుషుల ఆరోగ్యానికి ఈ ఆహారాలు ఎంతో మేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.