Healthy Snacks for Children in Summer : వేసవిలో పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇందుకోసం కొన్ని స్నాక్స్(Snacks) సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్ స్మూతీస్ : మీ పిల్లలను సమ్మర్లో హెల్తీగా ఉంచడంలో స్మూతీలు చాలా బాగా ఉపయోగపడుతాయి. పండ్లు, కూరగాయలు, పాలు ఇతర పదార్థాలను ఉపయోగించి ప్రిపేర్ చేసే స్మూతీలలో విటమిన్లు, ప్రొటీన్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి, మీ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని ప్రిపేర్ చేసి అందించండి. రోజంతా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటారు.
ఫ్రూట్ కబాబ్స్ : ఫ్రూట్ కబాబ్స్ కూడా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. పోషకాలతో నిండి రుచికరంగా ఉండే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. వారు ఆనందించే విధంగా ఇంద్రధనస్సు క్రమంలో ఈ ఫ్రూట్ కబాబ్‌లను తయారుచేసి ఇవ్వండి. ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, పైనాపిల్స్, మామిడి పండ్లతో పాటు మరికొన్ని పండ్లను ఉపయోగించి ఈ కబాబ్స్ రెడీ చేసి మీ పిల్లలకు అందించండి.
వాటర్ మిలన్ పాప్సికల్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలా మంది తప్పకుండా తినే పండు పుచ్చకాయ. 92% నీటితో కూడి ఉండే ఈ పండు.. వేసవిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే, నార్మల్‌గా పిల్లలు తినడానికి ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు. కాబట్టి, దీనిని పాప్సికల్స్గా చేసి పిల్లలకు స్నాక్స్ రూపంలో అందించండి. చాలా ఇష్టంగా తింటారు.
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!
వెజ్జీ ట్రేలు : పిల్లలు వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కూరగాయలు తినేలా చూడడం చాలా అవసరం. కానీ, వాటిని కొందరు నిరాకరిస్తారు. అలాంటి పిల్లలకు వెజ్జీ ట్రేల రూపంలో అందిస్తే చాలా చక్కగా తింటారు. క్యారెట్లు, బ్రోకలీ, సెలెరీ, దోసకాయలు, బెల్ పెప్పర్స్‌తో పాటు మరి కొన్నింటితో ఈ ట్రేలను ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు.
ఆల్-ఫ్రూట్ పాప్సికల్స్ : పిల్లలు ఐస్‌క్రీమ్స్ రూపంలో ఉండే పాప్సికల్స్ తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మీరు ఆల్ ఫ్రూట్స్‌తో పాప్సికల్స్ చేసి ఇచ్చారంటే తగిన పోషకాలు అందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. ఇక వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా మార్కెట్లో లభించే పాప్సికల్ అచ్చులను కొనుగోలు చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలు ఇష్టంగా తినే పండ్లను ముక్కలుగా చేసి వాటిని పాప్సికల్స్లో నింపుకోవాలి. అదనపు రుచి కావాలంటే బెర్రీలు, కొంచెం తేనె, కొన్ని కొబ్బరి నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పాప్సికల్ స్టిక్‌ను చొప్పించి అవి గట్టిపడే వరకు ఫ్రీజర్‌లో ఉంచండి. అంతే రుచికరమైన నోరూరించే పాప్సికల్స్ రెడీ!
ప్రోజెన్ గ్రేప్స్ : ఇది కూడా వేసవిలో పిల్లలు తినడానికి ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ద్రాక్షను శుభ్రంగా కడిగి పొడిగా మారే వరకు కాసేపు ఆరబెట్టి, ఆ తర్వాత గట్టిగా మారే వరకు ఫ్రీజర్‌లో ఫ్లాట్‌గా ఉంచాలి. అంతే అవి గడ్డకట్టాక తింటే భలేగా ఉంటుంది.
చల్లని సాయంకాలం వేళ... పోషకాలతో నిండిన స్నాక్స్... ఎంత ఆరోగ్యమో..!