ETV Bharat / health

ఉదయం టిఫెన్​గా అన్నం తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుంది? - RICE INSTEAD OF TIFFIN - RICE INSTEAD OF TIFFIN

MORNING RICE EATING GOOD OR BAD ? : ఈ రోజుల్లో చాలా మంది ఉదయం ఏదో ఒక టిఫెన్​ తింటారు. కానీ.. కొందరు పొద్దున కూడా అన్నం తింటారు. మరి ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Diet Plan for Night Shift Employees
Diet Plan for Night Shift Employees
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 9:44 AM IST

Healthy Diet Plan for Night Shift Workers : ఉదయం చాలా మంది టిఫెన్​ లాగిస్తుంటారు. ఇడ్లీ నుంచి దోసె వరకు టేస్టీ టేస్టీ ఐటమ్స్​ తినేస్తుంటారు. అయితే.. కొన్ని కారణాలతో కొందరు మాత్రం పొద్దున కూడా అన్నం తింటారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా కాస్త ఆలస్యంగా నిద్రలేచి ఉదయాన్నే భోజనం చేస్తారు. మరి.. బ్రేక్​ఫాస్ట్(Breakfast) కు బదులుగా అన్నం తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా? అంటే.. దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.​

అల్పాహారానికి బదులు భోజనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. ఏం తింటున్నాం అనే దానికన్నా.. అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయనేది ముఖ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. మీరు తినే సమయం కొంచెం అటుఇటూ అయినా శరీరానికి అందించే పోషకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని డాక్టర్ జానకీ శ్రీనాథ్ సూచిస్తున్నారు. భోజనంలో తప్పకుండా సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అంటే.. దంపుడు బియ్యం, ఆకుకూరలు, పప్పు, పెరుగు వంటి పదార్థాలు లంచ్​లో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? ఈ ఫుడ్స్ తింటే ఫుల్ జాలీగా ఉండొచ్చు!

అదేవిధంగా.. మీరు ఉదయం అల్పాహారంగా తినాల్సిన వాటిని సాయంత్రం స్నాక్స్‌లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. స్నాక్స్​లో గుగ్గిళ్లు, ఓట్స్‌, రాగి జావ, ఆమ్లెట్‌, జొన్నఇడ్లీ, పెసరట్టు, దోశ వంటివీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. నైట్ షిఫ్ట్​లో పనిచేయాల్సి ఉన్నవారు.. తాజా పండ్లను సలాడ్స్‌గా 6 నుంచి 7 గంటల మధ్యలో తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆ తరువాత రాగి, జొన్నపిండితో చేసిన చపాతీలను ఆకుకూరలతో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా మీరు యాక్టివ్​గా ఉండేలా కూడా చేస్తాయంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

మీరు వాకింగ్ పొద్దున చేస్తున్నారా? సాయంత్రమా? - ఎన్ని బెనిఫిట్స్ కోల్పోతున్నారో!​ - రీసెర్చ్ తేల్చిన నిజం!

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇవన్నీ బరువుకు తగ్గ మోతాదులో తినాలని సూచిస్తున్నారు. నిద్రకు కనీసం ఎనిమిది గంటలు కేటాయించుకోవాలని చెబుతున్నారు. ఇవి చేస్తూ.. తప్పకుండా వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​షిఫ్ట్​ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు మస్ట్ - లేకుంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.