ETV Bharat / health

అలర్ట్​: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Soaked Rice Health Benefits - SOAKED RICE HEALTH BENEFITS

Soaked Rice Health Benefits : చాలా మంది అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండుతుంటారు. మీరు అలాగే చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఎందుకంటే.. నానబెట్టిన బియ్యంతో వండిన ఆహారం తీసుకుంటే శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

Health Benefits Of Soaked Rice
Soaked Rice Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 12:18 PM IST

Health Benefits Of Soaked Rice : రోజువారి ఆహారంలో భాగంగా ఉదయం టిఫెన్ తీసుకున్నా.. మిగతా రెండు పూటల్లో ఏదో ఒక పూట తప్పనిసరిగా అన్నం తీసుకుంటుంటారు చాలా మంది. కొందరైతే మూడు పూటలా అన్నమే తీసుకుంటుంటారు. అయితే, సాధారణంగా అన్నం వండేటప్పుడు చాలా మంది రైస్ కడిగి వెంటనే వండుతుంటారు. మరికొందరు మాత్రం అన్నం వండడానికి ముందు కొద్దిసేపు బియ్యాన్ని నానబెట్టి ఆ తర్వాత కుక్ చేస్తుంటారు. ఇలా బియ్యం నానబెట్టి అన్నం వండటం మంచిదేనా అంటే.. నిపుణుల నుంచి "ఎస్​" అనే సమాధానమే వస్తుంది. వారు అలా అనడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

బియ్యాన్ని నానబెట్టే ప్రక్రియ దాని గ్లైసెమిక్ ఇండెక్స్​(GI), పోషకాహార ప్రొఫైల్​ను ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. గ్లైసెమిక్ ఇండెక్స్​ అనేది.. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతాయో కొలిచే ఒక మార్గం. సాధారణంగా ఆహారాలకు 0 నుంచి 100 వరకు GI స్కోరు ఇస్తుంటారు. అందులో తక్కువ GI స్కోరు ఉన్న ఫుడ్స్ చాలా స్లోగా జీర్ణమవుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. అలాగే నిరంతర శక్తిని అందిస్తుందని చెబుతున్నారు.

అలాగే వండేముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్​లో ఉంచే.. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ఏర్పడుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్​ స్కోర్​ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. బియ్యం గింజలలో నేచురల్​గా ఉండే కొన్ని ఎంజైమ్​లు.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను సాధారణ గ్లూకోజ్​గా మార్చే ప్రక్రియనే ఎంజైమాటిక్ బ్రేక్​డౌన్ అని అంటాం.

ఈ చర్య ఫలితంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయట. అంతేకాకుండా.. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఆహారంలో పోషకాల శోషణ మెరుగుపడుతుందంటున్నారు. ఎందుకంటే.. ఎంజైమాటిక్ బ్రేక్​డౌన్ ప్రక్రియ ఫైటిక్ యాసిడ్, టానిన్‌ల వంటి యాంటీ న్యూట్రియంట్‌లను విచ్ఛిన్నం చేసి బాడీకి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వీటితో పాటు బియ్యాన్ని నానబెట్టడం వల్ల రైస్ త్వరగా ఉడకడమే కాకుండా మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా ఉడుకుందంటున్నారు. అలాగే.. అన్నం ఒదుగవుతుందని చెబుతున్నారు.

అలర్ట్​: బ్రేక్​ఫాస్ట్​గా అన్నం తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

2018లో 'జర్నల్ ఆఫ్ సెరీల్ సైన్స్‌'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బియ్యాన్నిఎక్కువ సేపు నానబెట్టి వండిన ఆహారం తిన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని యాంగ్జౌ విశ్వవిద్యాలయానికి చెందిన పోషకాహార నిపుణులు డాక్టర్ Xiaobing Yang పాల్గొన్నారు. బియ్యాన్ని నానబట్టి వండుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల ప్రయోజనాలే కాదు.. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్​ ఉన్నవారు మితంగా అన్నంగా తినేలా చూసుకోవాలి. అలాగే బియ్యం ఉడికించడానికి ముందు నాలుగు గంటల కంటే ఎక్కువసేపు నానబెట్టకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అందులో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజాలు వాటర్​లో కరిగిపోతాయని చెబుతున్నారు. అంతేకాదు.. నానబెట్టిన బియ్యాన్ని ఉడికించే ముందు అందులోని నీరు ఒంపి ఫ్రెష్​ వాటర్​ పోసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. ఈ ప్రక్రియ అందులో ఉన్న అదనపు పిండిపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంపార్టెంట్ : బరువు తగ్గాలంటే అన్నం బంద్​ చేయాల్సిందేనా? - నిపుణుల మాట ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.