Health Benefits of Yellow Tea : మనలో చాలా మంది మనసు బాగోపోయినా, తలనొప్పి వేధిస్తున్నా, ఉదయాన్నే శరీరానికి కాస్తంత ఉత్సాహాన్ని అందించాలన్నా ఓ కప్పు టీ తాగుతుంటారు. అయితే ప్రస్తుతం ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మెజార్టీ పీపుల్ సాధారణ టీకి బదులుగా ఆరోగ్యకరమైన టీలను ఎంచుకుంటున్నారు. అయితే చాలా మందికి హెర్బల్ టీ అంటే గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ, రెడ్ టీ వంటివి మాత్రమే తెలుసు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు.. మీరు తెలుసుకోవాల్సిన మరో టీ ఉంది. అదే ఎల్లో టీ. ఇది మిగతా టీల కంటే రుచికరంగా ఉండడమే కాదు బోలెడు పోషకాలను కలిగి ఉంది. కాబట్టి మీరు దీనిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, ఎల్లో టీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? దీనిని ఎలా తయారుచేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలోని మలినాల్ని, విషతుల్యాలను తొలగించి జీవక్రియల పనితీరును మెరుగుపరిచే కాలేయాన్ని కాపాడుకోవాలంటే డైలీ ఎల్లో టీ తాగడం మంచిదంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇందులోని పాలీఫినోల్స్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, హెపటైటిస్ (కాలేయ వాపు) సమస్యను దూరం చేయడానికి తోడ్పడతాయట! అదే విధంగా ఆకలిని పెంచే శక్తి ఎల్లో టీకి ఉందంటున్నారు నిపుణులు. భోజనానికి గంట ముందు కప్పు ఎల్లో టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట! ఇవే కాదు ఎల్లో టీ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఎల్లో టీలో కాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది : గుండెకు ఎన్నో రకాలుగా ఎల్లో టీ ఉండే పోషకాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటును తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ టీ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని స్పష్టం చేస్తున్నారు.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది : ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకుంటుంటారు. ఇదే కాదు ఎల్లో టీ కూడా వెయిట్ లాస్ అవ్వడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఈ టీ తాగినప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. అదే విధంగా ఇది బాడీ మాస్ ఇండెక్స్‌ని తగ్గిస్తుంది.
Green Tea Vs Black Tea : గ్రీన్ టీ Vs బ్లాక్ టీ.. ఆరోగ్యం కోసం ఏది బెటర్ ఛాయిస్!
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : ఎల్లో టీలో ఉండే తక్కువ కెఫిన్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అనేక జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్స్ తగ్గించడానికి ఈ టీ మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇవే కాకుండా ఈ టీలో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్ దంతాల ఎనామెల్‌ను బలపరుస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎల్లో టీని తయారుచేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
ఎల్లో టీని తయారు చేసుకునే విధానం : ఈ టీని Camellia Sinensis ఆకుల్ని పాక్షికంగా ఆక్సీకరణం చెందించడం ద్వారా తయారుచేస్తారు. అమోఘమైన రుచి, వాసన కలిగిన ఈ టీని ఇంట్లో ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఎల్లో టీ బ్యాగ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అందుకోసం ముందుగా కప్పు నీటిని బాగా వేడి చేసుకోవాలి. అవి మరిగిన తర్వాత అందులో టీస్పూన్ ఎల్లో టీ తేయాకుల్ని వేయాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆపై వడకట్టుకొని తేనె లేదంటే ఇతర ఆర్టిఫీషియల్ స్వీట్‌నర్స్‌ని కలుపుకొని తాగడమే.
Fruit Tea : అల్లం టీ.. గ్రీన్ టీ కాదు.. పండ్లతో వేడివేడి చాయ్..!