ETV Bharat / health

వేసవిలో బీరకాయ తింటే ఏం జరుగుతుంది! నిపుణులు సమాధానం వింటే షాక్​ అవ్వాల్సిందే! - Health Benefits of Ridge Gourd - HEALTH BENEFITS OF RIDGE GOURD

Ridge Gourd Health Benefits: నీటి శాతం అధికంగా లభించే కూరగాయల్లో బీరకాయలు ఫస్ట్​ ప్లేస్​లో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎండాకాలంలో వీటిని తింటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. మరి ఆ ప్రయోజనాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Health Benefits of Beerakaya
Health Benefits of Beerakaya
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 6:57 PM IST

Health Benefits of Beerakaya: బీరకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూర, పచ్చడి అంటూ రకరకాలుగా వండుకుని తింటుంటారు. అంతే కాదు నీటి శాతం అధికంగా లభించే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. అలాగే బీరకాయను ఎవరైనా తినవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​, యాంటీ ఆక్సిడెంట్స్​ వంటి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. బీరకాయ తింటే ఈజీగా ఆహారం జీర్ణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బీరకాయను ఈ మండే ఎండల్లో తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీరకాయను సమ్మర్‌లో తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. వాటిల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం..

డీహైడ్రేషన్​ నుంచి కాపాడుతుంది: బీరకాయలో 92శాతం నీరు ఉంటుంది. వేసవి కాలంలో బీరకాయ తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా బీరకాయలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి బీరకాయ తింటే.. శరీరంలో హీట్ తగ్గి చల్లగా రీఫ్రెష్‌గా ఉంటుంది. రోజంతా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. అలాగే బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ద్రవాలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 2013లో "జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్"​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బీరకాయ తిన్న వారిలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు.

బరువు నియంత్రణలో ఉంటుంది: బీరకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బీరకాయలో కేలరీలు తక్కువగా ఉండి నీరు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు తినకుండా ఉండేలా చేస్తాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

బార్లీ వాటర్​ - ఎండ నుంచి రక్ష మాత్రమే కాదు - ఈ సమస్యలకు కూడా దివ్యౌషధం! - Barley Water Benefits in Summer

డయాబెటిస్‌ను నియంత్రించడంలో: షుగర్​ వ్యాధితో బాధపడేవారికి బీరకాయ తినడం వల్ల ప్రయోజనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బీరకాయలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17% నుంచి 21% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్ ఆఫ్ ఎపిడెమియాలజీ చెందిన డా. సిమోన్ డి. విల్లియమ్స్ పాల్గొన్నారు. అధిక మెగ్నీషియం ఆహారం తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గిస్తుంది: బీరకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం శరీరం నుంచి సోడియంను విసర్జించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

మంచిదికదా అని సమ్మర్‌లో పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! - side effects of eating watermelon

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: బీరకాయలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్​ను కూడా బీరకాయ తగ్గిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: బీరకాయలోని పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: వేసవి కాలంలో బీరకాయ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బీరకాయలో ఉండే పోషకాల కారణంగా నీరసం, అలసట దరి చేరకుండా ఉంటారు. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం: బీరకాయలో విటమిన్స్, మినరల్స్ మెండుగా లభిస్తాయి. కాబట్టి ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాక్నే, సన్ ట్యాన్ తొలగించి, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఆపుతుంది. అదే విధంగా బీరకాయ తింటే హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా జట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ వచ్చాయా? నిద్రలేకపోవడమే కాదు, ఇవీ కారణాలే! - Reasons for Dark Circles

వెయిట్​ లాస్​కు శనగపిండి! నిజంగా పనికొస్తుందా? - Besan For Weight Loss

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.