ETV Bharat / health

పచ్చి ఉల్లిపాయ తింటున్నారా - ఏమవుతుందో తెలుసా? - Onions Health Benefits

Raw Onions Health Benefits: ఉల్లిపాయ.. ప్రతీ వంటగదిలో ఉండే పదార్థం. కూర ఏదైనా ఉల్లిపాయ పడితే ఆ రుచే వేరు. అయితే.. ఉల్లిపాయను కూరల్లో వేసుకుని తినడం కాకుండా.. పచ్చిగా తింటారు కొందరు. అలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Raw Onions Health Benefits
Raw Onions Health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 11:56 AM IST

Updated : Jan 29, 2024, 1:42 PM IST

Raw Onions Health Benefits: "మజ్జిగన్నం, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ" ఎన్ని తరాలు మారినా ఈ కాంబినేషన్​ మాత్రం మారదు. ఎందుకంటే ఇవి తింటే వచ్చే లాభాలు అనేకం. ముఖ్యంగా ఉల్లిపాయను చాలా మంది కూరలు, సాంబార్​, పచ్చడి చేసుకుని తింటుంటారు. ఇంకొంతమంది వాటిని పచ్చిగానే తింటుంటారు. అయితే.. పచ్చిగా తినే వాటిలో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఉల్లి పోషకాలు: ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అనే సామెత ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఉల్లిలో ఉండే పోషకాలు అటువంటివి. ఉల్లిపాయలో క్వెర్సెటిన్, యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఉల్లిపాయలలో విటమిన్ ఎ, బి6, సి, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్​ పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో రోజూ పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది: రోజురోజుకి క్యాన్సర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రాణాంతక సమస్య ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల క్యాన్సర్​ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఉల్లిపాయలలో.. ఆర్గానోసల్ఫర్, క్వెర్సెటిన్, ఆంథోసైనిన్లు అనే యాంటీకాన్సర్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. NIH(National Institute of Health) ప్రకారం, ఇవన్నీ క్యాన్సర్​ను నివారించడం, చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి.

ముడతలు తగ్గించడంలో సాయం: ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా చర్మంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఉల్లిపాయలలోని సల్ఫర్ కంటెంట్ కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచుతుందని, అలాగే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల చర్య ద్వారా అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

పాలు తాగకపోతే కాల్షియం ప్రాబ్లమ్ - ఇలా భర్తీ చేసుకోండి!

బెటర్ ఫెర్టిలిటీ: ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణాలు అనేకం. అయితే సంతానోత్పత్తిని సహజంగా పెంచుకోవడానికి ఉల్లిపాయ ముక్క ఎంతగానో సాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. వాటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా.. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. NIH ప్రకారం, ఉల్లిపాయలు తినడం ద్వారా కాపులేటరీ, టెస్టోస్టెరాన్ స్థాయిలు రెండూ మెరుగుపడతాయి.

రోగనిరోధక శక్తి: ఇమ్యూనిటీని పెంచడంలో ఉల్లిగడ్డ సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలలో పుష్కలంగా ఉండే సెలీనియం.. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఓవర్ రియాక్షన్లను తగ్గించడంలో, అలాగే రోగనిరోధక కణాలను ఆక్సీకరణం, ప్రొటీన్ సంశ్లేషణ, కాల్షియం బదిలీ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

విగ్ పెట్టుకునే అలవాటు ఉందా? - ఈ టిప్స్ పాటిస్తే స్టైల్ అదిరిపోద్ది!

యాక్టివ్​గా ఉండేలా: NIH ప్రకారం.. ఉల్లిపాయలు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. తద్వారా మానసిక స్థితిని పెంచడానికి, నిరాశతో పోరాడటానికి సహాయపడుతుందని స్పష్టమైంది.

మీ డైట్​లో ఈ చట్నీలు చేర్చుకోండి - హాయిగా తింటూ కొలెస్ట్రాల్ కరిగించుకోండి!

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ ఆయిల్స్​ ట్రై చేసే మెరుపు గ్యారంటీ!

Last Updated : Jan 29, 2024, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.