ETV Bharat / health

వెయిట్ తగ్గాలంటే బరువులే ఎత్తాల్సిన అవసరం లేదు - ఈ నీళ్లు తాగినా సరిపోతుందట! - Health Benefits Of Garlic

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 3:44 PM IST

Benefits Of Garlic : ప్రతి వంటింట్లో ఉండే వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే.. బరువు తగ్గడానికి కూడా ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందట. మరి.. వెయిట్ లాస్ కావడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Garlic
Benefits Of Garlic (ETV Bharat)

Health Benefits Of Eating Garlic : కూరలు, పచ్చళ్లలో మనం వెల్లుల్లిని విరివిగా వాడుతుంటాం. వెల్లుల్లి వేయకుండా చేసిన ఏ కర్రీ కూడా అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే.. వెల్లుల్లిలో ఉండే ఘాటైన రుచి, సువాసన వంటకాల రుచిని మరింత పెంచుతాయి. ఆరోగ్యానికి మంచిదని కొంత మంది పచ్చి వెల్లుల్లిని కూడా తింటుంటారు. అయితే.. బరువు తగ్గడానికి కూడా వెల్లుల్లిని ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది :
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. మార్నింగ్‌ వెల్లుల్లి వాటర్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు.

ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం నుంచి బరువు తగ్గేవరకు - కివీతో ప్రయోజనాలు ఎన్నో!

జీర్ణక్రియకు మేలు : వెల్లుల్లిలోని సహజ సమ్మేళనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయం చేస్తాయని, అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు ఎక్కువగా రాలుతోందా ? - రోజూ ఈ జ్యూస్‌లు తాగారంటే ప్రాబ్లమ్​ సాల్వ్​!

గుండె ఆరోగ్యంగా : వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరించడానికి, అలాగే రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులు తగ్గిపోయి, గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే వెల్లుల్లి వాటర్‌ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది :
వెల్లుల్లిలో ఉండే కొన్ని రకాల గుణాలు కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ మార్నింగ్‌ వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని అంటున్నారు. 2020లో "Food & Function" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి కొవ్వు కణాల పెరుగుదలను అణచివేయడంలో, అలాగే కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని జియాంగ్‌సీ యూనివర్సిటీ ఆఫ్ ట్రాడిషనల్ చైనీస్ మెడిసిన్ ప్రొఫెసర్ 'డాక్టర్ జియాన్‌ఫెంగ్ లి' పాల్గొన్నారు.

చర్మం ఆరోగ్యంగా :
వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దీనివల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డయాబెటిస్ రోగులు ట్యాబ్లెట్స్​ అవతల విసిరికొట్టొచ్చు! - ఈ హెర్బల్‌ డ్రింక్స్‌ తాగితే చాలు!

ఉదయం వాష్​ రూమ్​లో అవస్థలు పడుతున్నారా? - రాత్రివేళ ఈ వాటర్ తాగితే ఆల్​ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.