Does Head Shaving Make Hair Growth Thicker? : రకరకాల కారణాలతో జుట్టు రాలుతూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు జనాలు పలు రకాల మార్గాలను అనుసరిస్తారు. అందులో ఒకటి గుండు చేయించుకోవడం. ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. మరి.. నిజంగానే గుండు కొట్టించడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత? దీనిపై నిపుణులు ఏం ఏమంటున్నారు? పరిశోధనల్లో ఏం తేలింది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"గుండు కొట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందా?" అంటే.. నిపుణుల నుంచి 'NO' అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. తలను షేవ్ చేయించినప్పుడు మృత వెంట్రుకల కణాలు పూర్తిగా తొలగిపోతాయి. దాంతో.. గుండు తర్వాత పెరిగే వెంట్రుకలు సూర్యరశ్మికి లేదా ఇతర రసాయనాలకు గురికావు. కాబట్టి, షేవ్ చేసిన తర్వాత ముందు కన్నా కాస్త నల్లగా గుండు కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ జుట్టు మందంలో ఎలాంటి తేడాలూ ఉండవంటున్నారు.
1999లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. షేవింగ్ అనేది జుట్టు మందాన్ని ప్రభావితం చేయదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ కె. ఆర్. మెక్‌డొనాల్డ్ పాల్గొన్నారు. తలను షేవ్ చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరగదని ఆయన పేర్కొన్నారు.
జుట్టు బాగా రాలుతోందా? - ఎరువు వేయాల్సింది నెత్తిన కాదు - పొట్టలో! - Best Hair Growth Foods
ఇదిలా ఉంటే.. తలపై షేవ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కొన్ని లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా జుట్టును మెయింటెన్ చేయడం ఈజీగా ఉంటుంది. అంటే.. మాటిమాటికీ దువ్వడం, బ్లో డ్రైయర్ వంటి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే గుండు కొట్టించడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది! తలపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ఫలితంగా కొంతవరకు జుట్టు రాలే సమస్య తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
అయితే.. జుట్టు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గుండు కొట్టించుకోవాలని అనుకునేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కాల్ఫ్ సున్నితంగా ఉండేవారు, చర్మ సమస్యలు ఉన్నవారు జుట్టు షేవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రధానంగా ఎండకు వెళ్లినప్పుడు గుండు మండిపోతుంది. ఇది సన్‌బర్న్‌కు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు.
జుట్టు మందంగా ఎలా మార్చుకోవాలంటే?
- జుట్టు ఒత్తుగా పెరగడంలో తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.
- ముఖ్యంగా విటమిన్స్ ఎ, సి, డి, ఇ, బయోటిన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
- అదేవిధంగా రక్తప్రసరణ మెరుగ్గా కొనసాగడానికి హెయిర్‌ఫోలికల్స్ ప్రేరేపించడంలో సాయపడే రెగ్యులర్ స్కాల్ప్ మసాజ్‌లు చేయించుకోవాలంటున్నారు.
- జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. ఎక్కువగా వేడి ఉండే స్టైలింగ్, హార్ష్ కెమికల్స్ ట్రీట్‌మెంట్స్‌ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
- వీటి కారణంగా హెయిర్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా సన్నబడుతుందంటున్నారు.
- కాబట్టి వీటికి బదులుగా ప్రొటీన్ ట్రీట్‌మెంట్ వాడి జుట్టుని స్ట్రాంగ్‌గా చేసుకోవాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎన్ని రోజులకోసారి తలకు నూనె రాసుకోవాలి? ఎలా అప్లై చేసుకుంటే లాభం? - Hair Oil Using Tips