ETV Bharat / health

ఒక్కసారి క్యారెట్​తో ఈ హెయిర్ మాస్క్​లు ట్రై చేయండి - మీ జుట్టు ఓ రేంజ్​లో పెరుగుతుంది! - Carrot Hair Growth Packs - CARROT HAIR GROWTH PACKS

Carrot Hair Growth Packs : క్యారెట్​తో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. జుట్టుకు బోలెడు లాభాలున్నాయి. ముఖ్యంగా క్యారెట్​తో హెయిర్ మాస్క్​లు ప్రిపేర్ చేసుకొని.. జుట్టుకు అప్లై చేశారంటే ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా ఇట్టే తొలగిపోతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వెంట్రుకలు వేగంగా, ఒత్తుగా పెరుగుతాయట! మరి, ఆ మాస్క్​లేంటో ఇప్పుడు చూద్దాం.

Carrot Masks For Hair Growth
Carrot Hair Growth Packs (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 9:40 AM IST

Carrot Masks For Hair Growth : క్యారెట్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి, సి, ఐరన్, కాల్షియంతో పాటు ఇతర పోషకాలు మీ ఆరోగ్యానికే కాదు.. జుట్టు సంరక్షణకూ చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. క్యారెట్​తో(Carrot) కొన్ని పదార్థాలను కలిపి హెయిర్ ప్యాక్స్ చేసుకొని యూజ్ చేయడమే. ఫలితంగా ఏవైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోయి.. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందంటున్నారు. ఇంతకీ, ఏంటి ఆ హెయిర్‌ప్యాక్స్? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్యారెట్, అవకాడో మాస్క్ : ఇందుకోసం ముందుగా రెండు క్యారెట్స్, అవకాడో సగభాగం తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సిలో వేసి మెత్తని పేస్ట్​లా పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్​లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్ఫూన్ల తేనె యాడ్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేసి స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నవారు ఈ మాస్క్​ని వాడితే జుట్టు మృదువుగా మారి ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

క్యారెట్, ఆలివ్ ఆయిల్ మాస్క్ : ఇది కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక క్యారెట్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అది ఆరేవరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి.

2017లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజికల్ సైన్స్‌'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. క్యారెట్​లో ఉండే విటమిన్ ఎ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని 'సియోల్​ యూనివర్సిటీ హాస్పిటల్​'కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ యున్‌హి షిన్ పాల్గొన్నారు. క్యారెట్​ సంబంధిత హెయిర్​ మాస్క్​లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు.

చుండ్రు సమస్య ఎంతకీ తగ్గట్లేదా? - బిర్యానీ ఆకులతో ఇలా చేస్తే మళ్లీ ఆ ప్రాబ్లమే ఉండదు!

క్యారెట్, ఎగ్ మాస్క్ : ఈ హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగడానికి చాలా బాగా తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్​ కోసం ముందుగా ఒక క్యారెట్​ను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై మిక్సి జార్ తీసుకొని అందులో ఒక గుడ్డు పగులకొట్టి పోసుకోవాలి. దానిలోనే క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి.

క్యారెట్, కొబ్బరిపాల మాస్క్ : ఇందుకోసం ముందుగా ఒక క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీలో వేసి జ్యూస్​లా పట్టుకొని దాని నుంచి రసాన్ని ఒక బౌల్​లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో పావు కప్పు కొబ్బరి పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అనంతరం కాటన్ బాల్ సాయంతో ఆ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు డ్యామేజ్​ని తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంట్రస్టింగ్ : గుండు కొట్టించుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందా? - రీసెర్చ్​లో కీలక విషయాలు వెల్లడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.