ETV Bharat / health

జుట్టు సమస్యలతో అలసిపోయారా? - ఈ ఒక్క ప్యాక్ ట్రైచేయండి - మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది! - Hair Care Tips

Hair Care Tips : ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఎంతో మంది జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం.. వంటి ప్రాబ్లమ్స్​తో బాధడుతున్నారు. ఇలాంటి వారు.. ఉసిరి, కొబ్బరినూనె హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Hair
Hair Care Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 4:27 PM IST

Best Hair Mask for Hair Growth : ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి జుట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. ఉసిరిలో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు.. ఎండ కలిగించే నష్టం నుంచి జుట్టును రక్షిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో అధికంగా ఉండే విటమిన్ C జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుందని చెబుతున్నారు. 2016లో "Journal of Ethnopharmacology"లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఉసిరిపొడిని జుట్టుకు యూజ్​ చేసిన వారిలో తలపై వాపు తగ్గడమే కాకుండా జుట్టు పెరుగుదల గణనీయంగా పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు.

ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్​తో చెక్ పెట్టండి!

ఇక కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందని ప్రముఖ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రింకీ కపూర్ చెబుతున్నారు. అంతేకాకుండా.. కొబ్బరి నూనె తలపై తేమను ఉంచడం ద్వారా.. జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుందని పేర్కొన్నారు. అలాగే.. హెయిర్ షాఫ్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతూ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కపూర్ చెబుతున్నారు. దీంతోపాటు కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చికాకుగా ఉన్న స్కాల్ప్‌కు మంచి రిలీఫ్ కలిగిస్తాయని అంటున్నారు.

ఈ హెయిర్ మాస్క్​ను ఎలా అప్లై చేయాలంటే.. ముందుగా ఒక గిన్నెలో కాస్త కొబ్బరినూనె తీసుకొని లైట్​గా వేడి చేయండి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆపై ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా 1 గంట పాటు ఉంచి, ఆ తర్వాత సున్నితమైన షాంపూతో తలస్నానం చేయండి.

ఇలా చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ కొబ్బరినూనె, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం ద్వారా హెయిర్​కు మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు డాక్టర్ కపూర్. స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మగాళ్లలో జుట్టు రాలే సమస్య - మీకు తల స్నానం చేయడం రాకనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.