GUAVA VS DRAGON FRUIT : జామకాయ, డ్రాగన్ ఫ్రూట్.. ఈ రెండు పండ్లలో ఏది మంచిదో మీకు తెలుసా? మన ఇళ్లలో విరివిగా దొరికే జామకాయతో పోలిస్తే మార్కెట్లో కనిపించే డ్రాగన్ ఫ్రూట్ రుచిలో దాదాపు రెండూ ఒకేరకంగా ఉంటాయి. కానీ రెండు పండ్లను పోల్చి చూస్తే జామ తక్కువ ధరకే లభిస్తుంది. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ కొనే బదులు కిలో జామపండ్లు కొనొచ్చు. విటమిన్లు, మినరల్ కంటెంట్, కేలరీలు, ఇతర ప్రయోజనాలు విషయంలో ఈ రెండు పండ్లను పోల్చితే విన్నర్ ఎవరో తెలుసా?
మీ చెవి చెప్పకపోతే అడుగు పడదని తెలుసా!- నడకలో ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్ - trouble in walking
జామ...
ఆరోగ్య పరంగా చూస్తే జామ పండు క్యాన్సర్ నివారిణిగా, డయేరియా విరుగుడుగా పనిచేస్తుంది. మలబద్ధకం బాధితులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. స్కర్వీ వ్యాధి చికిత్సకు సహాయపడడంతో పాటు విరేచనాలతో బాధపడే వారికి జామ పండు మంచిది. రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు దగ్గును నయం చేస్తుంది. కంటి చూపును మెరుగు పర్చడంలో దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలతో పాటు జలుబుకు మెడిసిన్‌గా పనిచేస్తుంది. వృద్ధాప్య నిరోధక ప్రయోజనాలతో పాటు చర్మం కాంతివంతంగు ఉంచుతుంది. చర్మ వ్యాధుల చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలిపోకుండా సహకరిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. దగ్గు, ముక్కు కారడం, తుమ్ములు, నోరు, నాలుక లేదా పెదవుల వాపు, గురక సమస్యలు ఉన్న వారు జామపండ్లు తినడం మంచిది.
డ్రాగన్ ఫ్రూట్
అరోగ్య ప్రయోజనాల విషయంలో డ్రాగన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ (వృద్ధాప్య నివారిణి), కొలెస్ట్రాల్‌ను క్రమబద్ధీకరిచడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఆర్థరైటిస్‌ను అణిచివేస్తుంది, సన్ బర్న్ నయం చేయడంతో పాటు మొటిమలు రాకుండా మేలు చేస్తుంది.
న్యూట్రిషన్ పరంగా 100 గ్రాముల్లో కార్బోహైడ్రేట్స్ శాతం
- జామపండ్లు 14.30 గ్రాములు
- డ్రాగన్ ఫ్రూట్ 14.30 గ్రాములు
100 గ్రాముల్లో ఫైబర్ శాతం
- జామపండ్లు 5.40 గ్రాములు
- డ్రాగన్ ఫ్రూట్ 1.00 గ్రాములు
100 గ్రాముల్లో చక్కెర శాతం
- జామపండ్లు 8.90 గ్రాములు
- డ్రాగన్ ఫ్రూట్ 9.00 గ్రాములు
100 గ్రాముల్లో ప్రొటీన్ శాతం
- జామపండ్లు 2.50 గ్రాములు
- డ్రాగన్ ఫ్రూట్ 2.00 గ్రాములు
100 గ్రాముల్లో క్యాల్షియం శాతం
- జామపండ్లు 18.00 మి.గ్రా.
- డ్రాగన్ ఫ్రూట్ 8.80 గ్రాములు
100 గ్రాముల్లో మెగ్నీషియం శాతం
- జాంపండ్లు 22.00 మి.గ్రా.
- డ్రాగన్ ఫ్రూట్ 0 గ్రాములు
100 గ్రాముల జామపండ్లలో విటమిన్ బి3 పరిమాణం 1.08మి.గ్రా. కాగా, డ్రాగన్ ఫ్రూట్లో కేవలం 0.16 మి.గ్రా. మాత్రమే. జామపండ్లలో బి6, బి9, ఇ, కే విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. జామపండ్లలో సి విటమిన్ 228 మి.గ్రా. కాగా, డ్రాగన్ ఫ్రూట్లో 9మి.గ్రా. మాత్రమే. జామపండ్లలో మినరల్స్, పొటాషియం శాతం 417మి.గ్రా. అంటే డ్రాగన్ ఫ్రూట్లో ఆ సంఖ్య జీరో మాత్రమే.
నిలబడి నీళ్లు తాగుతున్నారా? - మీరు డేంజర్లో ఉన్నట్టే! - HOW TO DRINK WATER