ETV Bharat / health

నేలపై పడుకోవడం ఎంతవరకు సేఫ్? నిపుణులు ఏమంటున్నారు? - Ground Sleeping Side Effects

Ground Sleeping Side Effects And Benefits : ఇటీవలి కాలంలో నేలపై పడుకోవడం, చెప్పులు లేకుండా నడవడం అనేవి పూర్తిగా మరిచిపోయాం. అలా చేయడం వల్ల మనం నిజంగా నష్టపోతున్నామా? ఒకవేళ అలా చేస్తే లాభాలేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 4:19 PM IST

Ground Sleeping Side Effects And Benefits
Ground Sleeping Side Effects And Benefits (Getty Images)

Ground Sleeping Side Effects And Benefits : చాపపై పడుకోవడం లేదా నేలపై పడుకోవడం అనేది భూతలానికి దగ్గరగా ఉన్నట్లు అవుతుంది. పైగా ఇలా పడుకోవడం అనేది ఇటీవలి కాలంలో ట్రెండ్ కూడా అయింది. మరి పురాతన కాలం నుంచి ఆచరిస్తున్న ఈ పద్ధతి సేఫేనా? ఇలా చేయడం వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అసలు గ్రౌండింగ్ జర్నీ (నేలపై పడుకోవడం) ఎలాగో దానిని ఎలా పాటించాలో తెలుసుకుందాం.

గ్రౌండింగ్ జర్నీ అంటే శరీరాన్ని నేలకు దగ్గరగా ఉంచడం. ఇలా చేయడం వల్ల భూతలంపై ఉండే ఎలక్ట్రాన్స్ సప్లై అనేది శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అదెలా అంటే, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్నింటికీ ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనేది తప్పనిసరి. అతిపెద్ద ఎలక్ట్రికల్ గ్రిడ్స్ నుంచి పవర్ ప్లాంట్స్, ఇళ్లు, బిల్డింగులు, ఫ్యాక్టరీలు ఎలక్ట్రిసిటీ వినియోగం లేకుండా మెయింటైన్ చేయలేకపోతున్నాం. పైగా వీటన్నిటికీ ఎర్తింగ్ చేస్తున్నాం. కాబట్టే, అవి స్టేబుల్‌గా, సెక్యూర్డ్‌గా ఉంటున్నాయి. అదే విధంగా మానవ శరీరం కూడా గ్రౌండింగ్ లేదా నేలకు దగ్గరలో ఉండటం వల్ల స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా ప్రతి ఒక్కరూ భూఉపరితలానికి దూరంగా ఉంటున్నారు. నేలపై పడుకోవడం, చెప్పుల్లేకుండా నడవడం వంటి వాటిని మర్చిపోయారు. ఇలా చేయడం వల్ల రానున్న కాలంలో మానవ శరీరంలో ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. శరీరంలో ఉండాల్సిన ఎలక్ట్రిసిటీ స్థిరత్వం కోల్పోవాల్సి వస్తుందట. చాలా మంది నమ్మకం మేరకు నేలలో నెగెటివ్ ఎలక్ట్రిక్ ఛార్చ్ ఉంటుందని అనుకుంటారు. వాస్తవం అది కాదు భూతలానికి, మానవ శరీరానికి మధ్య ఎలక్ట్రాన్ల సరఫరా జరుగుతుందట.

సైడ్ ఎఫెక్ట్స్:
నేలకు దగ్గరగా ఉండటమనేది చాలా వరకూ సేఫే కానీ, ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. సడెన్​గా చెప్పుల్లేకుండా నడవడం వంటివి చేయడం వల్ల అరికాలికి ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ప్రస్తుత జీవనశైలిలో ఎక్కడ పడితే అక్కడ మురికిపేరుకుపోయిన దారులు ఉండటం వల్ల అలర్జీలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు విద్యుత్ సరఫరా ఉన్న నేలపై అడుగువేయడం వల్ల కరెంట్ షాక్ కలిగే ప్రమాదం కూడా ఉంది.

బెనిఫిట్స్ ఇవే:

  • నొప్పుల తీవ్రత తగ్గుతుంది.
  • ఒత్తిడి తగ్గుతుంది.
  • రక్త సరఫరా పెరుగుతుంది.
  • శక్తి స్థాయిలు పెరిగి అలసట దూరం అవుతుంది.
  • మూడ్ మెరుగుపరిచి జీవన విధానాన్ని చక్కబెడుతుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.