ETV Bharat / health

అద్భుతం: రోజూ ఈ మొత్తంలో నెయ్యి తీసుకుంటే - మీ బాడీలో ఊహించని మార్పులు! - Is Ghee Good For Health - IS GHEE GOOD FOR HEALTH

Ghee Health Benefits : వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. అయితే ఈ రోజుల్లో పలు కారణాల వల్ల చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటున్నారు. నిజానికి రోజూ నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Is Ghee Good For Health
Ghee Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 12:45 PM IST

Is Ghee Good For Health : స్ఫైసీగా చేసుకునే బిర్యానీ నుంచి కమ్మగా ఉండే స్వీట్ల వరకూ అన్నింట్లో నెయ్యి ఉండాల్సిందే. కారణం నెయ్యి ఎందులో వేసినా ఆ రుచి అమృతంతో సమానం. కానీ ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే, కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా.. "అమ్మో వద్దు" అనేస్తుంటారు చాలా మంది. కానీ, రోజూ నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. ఇంతకీ, డైలీ నెయ్యి(Ghee) తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి? రోజూ ఎంత నెయ్యి తినాలి? ఏ నెయ్యి ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెయ్యి తినడం వల్ల లాభాలు:

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : రోజూ తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇలా తీసుకోవడం వల్ల తిన్నది త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా.. గ్యాస్ సంబంధిత సమస్యలూ దరి చేరవంటున్నారు.

మలబద్ధకాన్ని పోగొడుతుంది : మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు రోజూ మార్నింగ్ పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి మంచి రిలీఫ్ పొందవచ్చంటున్నారు నిపుణులు. 2018లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఖాళీ కడుపున ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవడం మలబద్ధకం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. ఈ రీసెర్చ్​లో 'నాంజింగ్ మెడికల్ యూనివర్సిటీ'కి చెందిన గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. X.Y. Zhang పాల్గొన్నారు. పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.

బరువు కంట్రోల్​లో ఉంటుంది : నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, దీని నుంచి మనకి అందే.. మంచి కొవ్వులు అధికబరువును అదుపులో ఉంచుతాయంటున్నారు. అలాగే, నెయ్యిలో ఉండే విటమిన్‌ ‘ఇ’ కాలేయాన్ని కాపాడడమే కాకుండా.. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుందని సూచిస్తున్నారు.

మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదా? - గుట్టు ఇలా తేల్చేయండి!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : ఇమ్యూనిటీ పవర్ తక్కువుండేవారు, నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు రోజూ తప్పనిసరిగా అన్నంలో రెండు చుక్కలైనా నెయ్యివేసుకుని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది అధిక రక్తస్రావాన్నీ, నొప్పులనీ నివారిస్తుందంటున్నారు. అలాగే.. ఇందులో ఉండే బ్యూటెరిక్‌ ఆమ్లం రోగనిరోధక శక్తిని పెంచుతుందని సూచిస్తున్నారు.

కీళ్లసమస్యలను తగ్గిస్తుంది : నెయ్యిలో ఉండే కె-విటమిన్‌ కాల్షియం శోషణకు తోడ్పడుతుంది. కాబట్టి, దంతక్షయం, కీళ్లనొప్పులు.. రాకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. అలాగే.. ఒంట్లోని మలినాలను పోగొడుతుందని చెబుతున్నారు.

ఎంత మోతాదులో నెయ్యి తినాలి: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలో ఒక నిర్దిష్ట సమాధానం లేదని నిపుణులు అంటున్నాకు. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయితే, పలువురు నిపుణులు సూచించిన ప్రకారం రోజుకు 2-3 చెంచాల నెయ్యి తినడం మంచిదని అంటున్నారు.

ఏ నెయ్యి మంచిదంటే? ఆవు, గేదె పాల నుంచి నెయ్యి తీసినప్పటికీ.. ఆవు నెయ్యి శ్రేష్ఠమైనదంటున్నారు నిపుణులు. ఆవు నెయ్యిలో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉండటంతో అది పసుపు రంగులో ఉంటుంది. అదే.. గేదె నెయ్యి తెల్లగా రుచిగా ఉంటుంది. కానీ, ఆవు నెయ్యిలో కొవ్వు శాతం తక్కువ కావడంతో పాటు, జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజ్యుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అలాగే.. ఆవు నెయ్యిని అన్ని వయసులవాళ్లూ తినొచ్చంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెయ్యి తింటే - అనారోగ్యకరమైన బరువు పెరుగుతారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.