ETV Bharat / health

నెయ్యి ఇలా తీసుకుంటే - ఏ ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఎటాక్ చేయదు! - Ghee Health Benefits - GHEE HEALTH BENEFITS

Ghee Health Benefits : మీరు డైలీ నెయ్యి తినడం లేదా? అయితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అవుతున్నట్లే అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే నెయ్యి తినడం వల్ల బోలెడు బెనిఫిట్స్​ ఉన్నాయని.. ముఖ్యంగా రోజూ ఉదయం ఖాళీ కడుపున గోరువెచ్చని వాటర్​లో కలుపుకొని తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

Ghee
Ghee Health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 7:51 PM IST

Health Benefits of Ghee : నెయ్యి తీసుకోవడం వల్ల బాడీలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా భయపడుతుంటారు. ఒకవేళ తినాలని ఉన్నా సరే.. నోరు కట్టేసుకుంటారు. కానీ, వివిధ పోషకాల సమ్మేళనమైన నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని(Ghee) ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఇంతకీ, ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెయ్యిలో చాలా రకాల పోషకాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయట. అలాగే.. డైలీ డైట్​లో నెయ్యిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని నరాల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు. ఇవేకాదు.. నెయ్యి వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : రోజు ఉదయం పరగడుపున ఒక టేబుల్​స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇది ఆహారం సులభంగా అరగడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మలబద్ధకాన్ని పోగొడుతుంది : మీరు మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నట్లయితే డైలీ మార్నింగ్ ఖాళీ కడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

2018లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పరిగడుపున 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవడం మలబద్ధకం లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో 'ది ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ నాంజింగ్ మెడికల్ యూనివర్సిటీ'కి చెందిన ప్రముఖ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. X.Y. Zhang పాల్గొన్నారు. ఖాళీ కడుపున నెయ్యి తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

బరువును కంట్రోల్​ చేస్తుంది : నెయ్యిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం బరువు నిర్వహణలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలోని హెల్తీ ఫ్యాట్స్ ఆకలి కోరికలను తగ్గించి కడుపు నిండిన భావనను పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.

మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదా? - గుట్టు ఇలా తేల్చేయండి!

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది : నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలతో కూడిన బ్యూట్రిక్ యాసిడ్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. కాబట్టి, ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు.

మెదడుకు మేలు : నెయ్యిలోని కొవ్వులు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి మెదడు కణాల అభివృద్ధికి, నిర్వహణకు అవసరమైన పోషకాలను అందిస్తాయంటున్నారు. కాబట్టి మీరు రోజు పరిగడుపున నెయ్యి తీసుకోవడం ప్రారంభిస్తే అది మెదడు పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.

హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది : పరగడుపున నెయ్యి తీసుకోవడం హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హార్మోన్ల సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఎముకలు దృఢంగా : మార్నింగ్ ఖాళీ కడుపున చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎముక మజ్జ బలంగా మారుతుందని.. శరీరంలోని బోన్స్ అన్నీ హెల్దీగా ఉంటాయంటున్నారు.

ఇవేకాకుండా.. ఉదయం పరగడుపున గోరువెచ్చని వాటర్​లో చెంచా నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుందని, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు పోవాలా? దేశీ నెయ్యి వాడితే అంతా సెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.