ETV Bharat / health

రాత్రి పూట ఈ పండ్లను అస్సలే తినకండి - ఎందుకో తెలుసా? - Fruits To Avoid At Night - FRUITS TO AVOID AT NIGHT

Fruits To Avoid At Night : మనం హెల్దీగా ఉండటానికి రోజూ తాజా పండ్లు తినడం చాలా ముఖ్యం. కానీ, రాత్రి పూట కొన్ని రకాల పండ్లను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. మరి, నైట్‌ టైమ్‌ తినకూడని ఆ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Fruits To Avoid At Night
Fruits To Avoid At Night
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 1:52 PM IST

Fruits To Avoid At Night : ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తాజా పండ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని రకాల పండ్లను రాత్రి సమయంలో తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని పండ్లను రాత్రి పూట తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి వాటితో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, రాత్రి సమయంలో తినకూడని పండ్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సిట్రస్ పండ్లు : మీకు నైట్‌ భోజనం చేసిన తర్వాత నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి పండ్లను తినడం అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే.. ఈ పండ్లలో చాలా ఆమ్లాలుంటాయి. వీటిని రాత్రి తినడం వల్ల గుండెల్లో మంటగా అనిపించి సరిగ్గా నిద్రపట్టకపోవచ్చని నిపుణులంటున్నారు.

పైనాపిల్ : పైనాపిల్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రి తినడం వల్ల కడుపులో యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ : దీనిలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును రాత్రి పడుకునే ముందు తినడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాని వల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. కాబట్టి, రాత్రిపూట వాటర్‌ మెలన్‌ తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

మామిడి పండ్లు : మామిడి పండ్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అయితే, వీటిని రాత్రి సమయంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులంటున్నారు.

పరిశోధన వివరాలు : 2014లో 'Nutrition and Metabolism' జర్నల్​లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహం లేని వారు రాత్రి భోజనంతో పాటు ఒక మామిడి పండు తిన్న 2 గంటల తర్వాత వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లో ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న 'డాక్టర్‌. శ్రీనివాసన్‌' పాల్గొన్నారు. నైట్‌ టైమ్‌లో మామిడి పండ్లను తినడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

షుగర్​ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే? - Bananas For Diabetes Patients

అరటిపండ్లు : అరటి పండ్లలో కూడా షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రాత్రి పూట తినకుండా పగలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ద్రాక్ష : వీటిలో సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లను రాత్రి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

కివీ : కివీ పండ్లలో విటమిన్‌ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే, వీటిని రాత్రి సమయంలో తినడం వల్ల జీర్ణ క్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణులంటున్నారు.

బొప్పాయి : బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

చెర్రీలు : చెర్రీ పండ్లలో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఇవి రాత్రి తినడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్‌ ఉన్నవారు ఈ పండ్లు తింటే - ఆరోగ్యానికి మంచిది! - Diabetes Patients Eat Fruits

ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు మంచివే- కానీ ఎక్కువ తాగితే ప్రమాదమే- బీ అలెర్ట్! - Coconut Water Side Effects

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.