Food Items To Build Muscles : కండలు పెంచాలని చాలా మంది కోరుకుంటారు. దీనికోసం వ్యాయామాలు కూడా చేస్తారు. అయితే.. కసరత్తులు మాత్రమే సరిపోవని.. తగిన ఆహారం కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవ్వడంతో పాటు.. కండరాల బరువు పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు - కండరాల బరువు పెరగడం కోసం సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కండరాల బరువు పెరగడానికి ఎంతో సహాయం చేస్తాయని అంటున్నారు. చేపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మజిల్ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుందట. అలాగే.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. ఇంకా.. ఇందులో విటమిన్ B12, సెలీనియం, ఐరన్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి.
వే ప్రొటీన్ : వే ప్రొటీన్‌లో శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులంటున్నారు.
ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ :
ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అంటే కొవ్వు పదార్థాలు తీయనటువంటి పాలు, పాల పదార్థాలు. ఇందులో అన్ని రకాల పోషకాలు, కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి. రోజూ ఆహారంలో ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల త్వరగా కండరాల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కండరాల బరువు పెరగాలనుకునే వారు పెరుగు, పాలను ఆహారంలో తీసుకోవాలి.
చికెన్ :
అలాగే కండరాల బరువు పెరగడానికి చికెన్ తినడం మంచిదని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఇందులో తక్కువ కొవ్వు ఉండి, ఎక్కువ ప్రొటీన్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే విటమిన్ బి6 వంటి గుణాలు కండరాలను బలంగా చేస్తాయని తెలియజేస్తున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్:
కండరాలు బలంగా అవ్వాలనుకునే వారు యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవాలి. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీరంలో ఉన్న కండరాల బరువు పెరగడం కోసం సహాయం చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్ :
కండరాల బరువు పెరగాలనుకునే వారు ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, వేరుశనగ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాడీలోని కండరాలు పెరగడంతో పాటు, బలంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు :
కండరాల బరువు పెరగడానికి తక్కువ ధరలో ఏదైనా ఆహారం ఉందంటే, అది గుడ్లనే చెప్పాలి. ఎగ్స్‌లో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, విటమిన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఆహారం కాబట్టి మజిల్ వెయిట్ పెరగాలనుకునే వారు రోజూ వీటిని తినాలి.
గమనిక : ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించండి.
ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? - హెల్దీగా ఉండటానికి ఇలా చేయండి!
మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?
కార్డియో ఎక్సర్సైజ్లు అంటే ఏంటి? ఈ వ్యాయామాల వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు