ETV Bharat / health

ముఖంపై చెమట ఎక్కువ పడుతుందా? జిడ్డుగా కనిపిస్తోందా? ఈ టిప్స్ ఫాలో అయితే టోటల్ సెట్! - Face Sweating Control Tips

Face Sweating Control Tips : మీకు ముఖంపై చెమట పడుతుందా? దీని వల్ల ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తున్నారా? ముఖంపై చెమట పట్టకుండా ఎప్పుడూ తాజాగా, అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీ కోసం మేం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. అవేంటంటే?

Etv Bharat
Face Sweating Control
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 3:15 PM IST

Face Sweating Control Tips : అందరికన్నా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. రోజంతా తాజాగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. కానీ చాలా మందికి ముఖం మీద విపరీతమైన చెమట వస్తుంది. నుదురంతా తడిసిపోతుంది. కాసేపు నడిచినా, ఏ చిన్న పని చేసినా చెమట కారిపోయి ముఖం జిడ్డుగా మారిపోతుంది. దీన్నే 'ఫేషియల్ హైపర్ హైడ్రెసిస్' అని కూడా పిలుస్తారు. బయటకు చెప్పకపోయినా ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కొందరిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖంపై చెమట పట్టకుండా ఎప్పుడూ తాజాగా కనిపించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు మా దగ్గర ఉన్నాయి. అవేంటంటే?

నిజానికి నుదురు మీద ఎక్కువ చమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో శారీరక శ్రమ, అధిక ఉష్ణోగ్రతతో, జన్యు పరమైన సమస్యలు, హార్మోన్లలో హెచ్చు తగ్గులు, ఒత్తిడి, ఆందోళన, నాడీ సంబంధిత రుగ్మతలు, ఊబకాయం తరచూ వాడే మెడిసిన్ ముఖ్య కారణాలు. మరి ఈ సమస్యను ఎలా అడ్డుకోవాలంటే?

  • హైడ్రేషన్: చెమట నుంచి బయట పడాలంటే ముందు మీరు చేయాల్సిన పని ఎక్కువ నీటిని తాగడం. హెడ్రేటెడ్​గా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది.
  • మసాలా ఫుడ్: స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరానికి చెమట ఎక్కువ పడుతుంది. అందుకే ముఖం, నుదుటి మీద చెమటతో ఇబ్బంది పడే వారు ఆహారంలో మసాలాలు తగ్గించాలి.
  • మద్యపానం: ఆల్కహాల్ కూడా శరీరంలో చెమటను పెంచుతుంది. మద్యపానం శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. డీ హైడ్రేషన్ కారణంగా ఎక్కువ చెమట పడుతుంది.
  • స్నానం: తరచుగా స్నానం చేయడం వల్ల చెమట పట్టకుండా ఉంటుంది. పరిశుభ్రంగా ఉండటం వల్ల బ్యాక్టీరియాను అరికట్టవచ్చు.
  • టాల్కమ్ పౌడర్: మీ శరీరంలో ఎక్కువగా చెమట పట్టే చోట తేమను గ్రహించగలిగే టాల్కమ్ పౌడర్ వేసుకొండి.
  • బరువు: అధిక బరువు కూడా మీకు ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. కాబట్టి మీ శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన BMI అధిక చెమటను తగ్గిస్తుంది.
  • కోల్డ్ ప్యాక్స్: ముఖం మీద అప్పుడప్పుడు కోల్డ్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడూ వీటిని వాడటం వల్ల చెమట సమస్య తగ్గుతుంది.
  • ఒత్తిడి: టెన్షన్ పడటం వల్ల కూడా మనిషికి చెమట బాగా పడుతుంది. కాబట్టి మీ ఒత్తిడి ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకొండి. ఇందుకోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, మెడిటేషన్ లాంటివి చేయాలి.
  • సున్నితమైన క్రీములు: మీరు తరచూ వాడే ఫేస్ క్రీములు సున్నితంగా ఉండేలా చూసుకొండి.ముఖ్యంగా యాంటీ పెర్పిరెంట్ గా ఉండే ఫేస్ క్రీములను మాత్రమే వాడండి.
  • ఫేషియల్ వైప్స్: బయటకు వెళ్లినప్పుడు మీరు ముఖాన్ని తుడుచుకునేందుకు వాడే వైప్స్ ఆయిల్ ఫ్రీగా ఉండాలి. జిడ్డు కలిగిన వైప్స్ వాడితే మీ ముఖం రంధ్రాలు మూసుకుపోనివ్వకుండా చేసి చర్మాన్ని దెబ్బతీస్తాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బ్రష్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్‌ చేస్తున్నారా? - మీ దంతాల పని అయిపోయినట్టే! - Mistakes Brushing Teeth

పీరియడ్స్ టైంలో విపరీతమైన నడుము నొప్పా? ఇలా చేస్తే బిగ్ రిలీఫ్ పక్కా​! - How To Reduce Back Pain

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.