Expiry Date for Household Items: ఎక్స్ పైరీ డేట్.. ప్రతి వస్తువుకూ ఉంటుంది. కానీ.. కొన్నింటి విషయంలోనే జనాలు జాగ్రత్తగా ఉంటారు. కానీ.. ఇంట్లో ఉపయోగించే పలు వస్తువుల విషయంలోనూ గడువు తేదీలను ఫాలో కావాలని అంటున్నారు నిపుణులు. లేదంటే.. అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆ వస్తువులు ఏంటి? ఎన్ని రోజులకొకసారి వాటిని మార్చాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
టూత్ బ్రష్: మార్నింగ్ దినచర్య బ్రషింగ్తోనే మొదలవుతుంది. అయితే.. చాలా మంది తమ టూత్ బ్రష్‌ను సంవత్సరాల పాటు ఉపయోగిస్తారు. అది అరిగిపోయింది అనుకునే వరకూ ఉపయోగిస్తునే ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. టూత్ బ్రష్‌ను ప్రతి మూడు నెలలకోసారి మార్చాలని సూచిస్తున్నారు.
డిష్ వాషింగ్ స్పాంజ్: గిన్నెలను శుభ్రం చేయడానికి స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను ఉపయోగిస్తుంటాం. చాలా మంది ఈ స్పాంజ్ పూర్తిగా పాడయ్యే వరకూ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన స్క్రబ్బర్‌లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పాత్రల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తుందని అంటున్నారు. కనుక స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను ప్రతి రెండు నెలలకోసారి మార్చాలని చెబుతున్నారు.
మేకప్ బ్రష్: చాలా మంది మహిళలు ఒకటే మేకప్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. బ్రష్‌ని ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయకపోవడం లేదా ఇతరులు కూడా ఆ బ్రష్‌ను ఉపయోగించడం మంచిది కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో పాటు.. కళ్లు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మేకప్ బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించవద్దని.. అదే సమయంలో ఇతరులకు ఇవ్వొద్దని అంటున్నారు. 3 నుంచి 5 నెలల మధ్యలో బ్రష్ మార్చడం చేయాలంటున్నారు.
మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night
దిండు: ఇంట్లో దిండుని రోజూ ఉపయోగిస్తాం. కానీ చాలా మంది దిండుకు ఉన్న కుషన్ కవర్‌ను మాత్రమే శుభ్రం చేస్తారు. అయితే దిండును ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దుమ్ము, ధూళి పేరుకుని అందులో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుందని.. దీంతో జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదని.. దిండును ఎప్పటికప్పుడు సూర్యరశ్మికి తగిలేలా చేసి ఏడాదిన్నర తర్వాత మార్చాలని సూచిస్తున్నారు. 2017లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం దిండులో పేరుకున్న బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చర్మ వ్యాధులకు కారణమవుతాయని కనుగొన్నారు.
దువ్వెన: దువ్వెనకు ఎక్స్‌పైరీ డేట్ అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే దాని మన్నిక, వాడే విధానం మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే దువ్వెనను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదా శుభ్రంగా లేని దువ్వెనను ఉపయోగించడం వల్ల శిరోజాలు దెబ్బతింటాయని.. ఫంగల్ ఇన్ఫెక్షన్తో జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2013లో జర్నల్ ఆఫ్ డెర్మటోలాజికల్ సైన్స్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం శుభ్రం చేయని దువ్వెనలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదల జుట్టు రాలడానికి దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెర్మటాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ అమీర్ షాహి పాల్గొన్నారు. శుభ్రం చేయని దువ్వెనలో డెర్మటోఫైట్స్ అనే శిలీంధ్రాలు ఎక్కువ ఉంటాయని.. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు..
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు తెలుసా? - మీ మనసు ఎంత బాధపడితే - మీ సెకండ్ బ్రెయిన్ అంత ఏడుస్తుంది! - Gut Health Damage Foods
అలర్ట్ : చీర అలా కట్టుకుంటే క్యాన్సర్ ఖాయం! - దేవుడా ఇంకా ఎన్ని చూడాలో! - What is Saree Cancer