Energy Foods In The Office : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఉదయాన్నే ఏదో ఒక టిఫిన్ చేసి త్వరగా ఆఫీస్‌కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎప్పుడో మధ్యాహ్నాం భోజనం చేసి, సాయంత్రం ఇంటికి రాగానే అలసిపోతారు. అయితే, ఇలా కాకుండా ఉండాలంటే ఉద్యోగం చేసే వారు బ్రేక్ టైంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హుషారుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మనల్ని రీఛార్జ్ చేసే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ - చాలా మంది ఉదయాన్నే 8 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత లంచ్‌కు సమయం ఉండటంతో.. ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో టీ, కాఫీల వంటి తాగుతుంటారు. అయితే, మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా లంచ్ వరకు పని చేయాలంటే ఈ టైంలో టీ, కాఫీలకు బదులు మజ్జిగ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల త్వరగా శక్తిని పొందొచ్చని అంటున్నారు. మజ్జిగలో సహజ సిద్ధంగా ఉండే ప్రోబయోటిక్స్, ఇంకా ప్రొటీన్ వంటివి ఆకలిని నిరోధిస్తాయని తెలుపుతున్నారు.
పుదీనా టీ : ఆఫీస్ పని చేసే వారు ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బందిపడతారు. అలాంటి సమయంలో పుదీనా టీని తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కొంత ఉపశమనం పొందవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే ఈ టీని మధ్యాహ్నాం భోజనం చేసిన తర్వాత తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
అరటి పండ్లు : మధ్యాహ్నాం భోజనం చేసిన తర్వాత మీ శరీరానికి మరిన్ని పోషకాలు అందాలంటే ఒక అరటి పండును తినాలని చెబుతున్నారు. దీనివల్ల త్వరగా ఎనర్జీని పొందవచ్చని.. అలాగే బనానాలో ఉన్న పోషకాలు పనిపై ఏకాగ్రత పెట్టేలా చేస్తుందని అంటున్నారు.
వేయించిన శనగలు (Roasted chana) : సాధారణంగా ఆఫీస్‌లో ఉన్నప్పుడు సాయంత్రం ఏదైనా స్నాక్ ఐటమ్స్ తినాలని అనిపిస్తుంది. అయితే, ఇలాంటప్పుడు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో వేయించిన శనగలను కొన్ని తినడం వల్ల వెంటనే శక్తిని పొందవచ్చని తెలియజేస్తున్నారు. ఇందులో ఫైబర్, ప్రొటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని కొన్ని తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుందని అంటున్నారు.
పిస్తాపప్పులు : సాయంత్రం టైంలో స్నాక్ ఐటమ్‌గా తినడానికి ఇంకా ఏదైనా ఉందా అంటే అది పిస్తాపప్పులనే చెప్పవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు, యంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయం చేస్తాయని చెబుతున్నారు.
టీనేజర్లకు 9గంటల నిద్ర మస్ట్- మిగతా వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
మీకు కంటి సమస్యలున్నాయా? - అది గ్లకోమానా? లేదా క్యాటరాక్టా?
మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే డయాబెటిస్ కావొచ్చు!