ETV Bharat / health

కోడిగుడ్డును ఇలా అప్లై చేస్తే - జుట్టు సమస్యలన్నీ పరార్ - హెల్దీ హెయిర్ గ్యారెంటీ! - Egg Masks for Hair Growth

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 3:12 PM IST

Egg Masks for Healthy Hair : కోడిగుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు.. దానిలోని పోషకాలు జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇలా.. హెయిర్ మాస్క్​లు ప్రిపేర్ చేసుకొని జుట్టుకు అప్లై చేస్తే మీ హెయిర్ ఆరోగ్యంగా, మృదువుగా తయారవ్వడం పక్కా అంటున్నారు!

EGG MASKS FOR HAIR GROWTH
Egg Masks for Healthy Hair (ETV Bharat)

Best Egg Masks for Hair Growth : కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు దాంతో కొన్ని హెయిర్ మాస్క్​లు ప్రిపేర్​ చేసి యూజ్​ చేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్​ ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వాటితో జుట్టు(Hair) మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుందని, మృదువుగా మెరిసిపోతుందని చెబుతున్నారు. ఇంతకీ, ఆ హెయిర్‌మాస్క్​లు​ ఏంటి? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంటివి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎగ్ మాస్క్ :

  • ముందుగా ఒక బౌల్ తీసుకొని మీ జుట్టు పొడవును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లు అందులో కొట్టి గిలకొట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి.
  • అలా 20-30 నిమిషాల పాటు ఉంచి ఆపై చల్లటి నీటితో గాఢత తక్కువ కలిగిన షాంపూ యూజ్ చేస్తూ తలస్నానం చేయాలి.
  • ఈ మాస్క్ మీ జుట్టుకు మంచి పోషణను అందించి బలోపేతం చేస్తుందంటున్నారు నిపుణులు.

2017లో 'జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. గుడ్డు సొనతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్. మార్గరెట్ ఓ. డేవిడ్ పాల్గొన్నారు. గుడ్డుతో తయారుచేసిన హెయిర్ మాస్క్​లు వాడడం వల్ల అందులోని పోషకాలు జుట్టును బలంగా మార్చడంతో పాటు తేమగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయని డాక్టర్ పేర్కొన్నారు.

గుడ్డు, ఆలివ్ నూనె మాస్క్ :

  • ఈ మాస్క్​ కోసం ఒక బౌల్​లో 1 లేదా 2 గుడ్లను పగులకొట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి.
  • 30 నిమిషాలు అలాగే ఉంచి ఆపై శుభ్రమైన వాటర్​తో వాష్ చేసుకోవాలి.
  • ఇది మీ జుట్టుకు తేమనందించి మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్​! - Onion Oil Benefits

గుడ్డు, పెరుగు మాస్క్ :

  • ముందుగా బౌల్​లో కాస్త పెరుగు తీసుకొని అందులో 1-2 గుడ్లను పగులకొట్టి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
  • అలాగే 20-30 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
  • ఈ మాస్క్ హెల్దీ హెయిర్ గ్రోత్​ను ప్రోత్సహిస్తుందంటున్నారు నిపుణులు.

గుడ్డు, అరటి మాస్క్ :

  • ఈ మాస్క్ కోసం బౌల్​లో ఒక పండిన అరటిపండును తీసుకొని గుజ్జుగా చేసుకోవాలి.
  • ఆపై అందులో 1-2 గుడ్లను పగులకొట్టి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం దాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
  • ఇది మీ జుట్టును బలంగా, మృదువుగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

గుడ్డు, కొబ్బరి నూనె మాస్క్ :

  • ఒక బౌల్​లో 1-2 గుడ్లను పగులకొట్టి దానికి కొద్దిగా కొబ్బరినూనె కలుపుకొని మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమాన్ని జుట్టుతో పాటు స్కాల్ప్​పై కూడా అప్లై చేయాలి. అలాగే 30 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
  • ఈ మాస్క్ జుట్టు చిట్లడాన్ని తగ్గించి బలంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు, అవకాడో మాస్క్ :

  • ఒక పండిన అవకాడోను మెత్తగా చేసి దానికి 1-2 గుడ్లను పగులకొట్టి ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
  • ఆపై దాన్ని బాగా మిక్స్ చేసుకొని హెయిర్​కు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది జుట్టుకు మంచి పోషణను అందించి హెయిర్ బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎన్ని రోజులకోసారి తలకు నూనె రాసుకోవాలి? ఎలా అప్లై చేసుకుంటే లాభం? - Hair Oil Using Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.