ETV Bharat / health

పెదాలు తేమను కోల్పోయి నిర్జీవంగా మారాయా?- ఈ స్క్రబ్స్​ ట్రై చేస్తే అధరాలకు మెరుపు గ్యారంటీ! - Effective Tips To Lip Care

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 12:12 PM IST

Effective Tips To Lip Care : ముఖానికి చిరునవ్వే అందం. ఆ నవ్వుకు మంచి రంగుతో ఉండే పెదాలే స్పెషల్ ఎట్రాక్షన్​. అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం! కానీ, కొన్ని పరిస్థితుల్లో లిప్స్ పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. అలాంటి టైమ్​లో ఈ నేచురల్‌ లిప్‌ స్క్రబ్స్‌ ట్రై చేశారంటే.. మీ పెదాలు లేలేత గులాబీ రేకుల్లా మునుపటి అందాన్ని సొంతం చేసుకుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Tips For Healthy Lip Care
Effective Tips To Lip Care (ETV Bharat)

Best Tips For Healthy Lip Care : పెదాలు ఆరోగ్యంగా ఉంటేనే.. అవి అందంగా కనిపిస్తాయి. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా మన నవ్వుకు మంచి రంగుతో ఉండే పెదాలే స్పెషల్ ఎట్రాక్షన్​. అయితే, అలాంటి పెదాలు(Lips) కొన్నిసార్లు వివిధ కారణాలతో తేమను కోల్పోయి పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కొందరు వాటిని లిప్​స్టిక్, వివిధ రకాల క్రీమ్స్​, జెల్స్ వాడి కవర్ చేస్తుంటారు. అలాకాకుండా సహాజసిద్ధంగా కొన్ని నేచురల్‌ లిప్‌ స్క్రబ్స్‌ని ఉపయోగించడం ద్వారా.. పొడిబారిన నల్లటి పేదాలను ఎర్రటి గులాబీ రేకుల్లా మార్చుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దాల్చిన చెక్క పొడి, తేనె : ఈ నేచురల్ లిప్ స్క్రబ్ నిర్జీవంగా మారిన పెదాలకు మంచి పోషణను అందించి ఆరోగ్యంగా, అందంగా మార్చుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో అర టీస్పూన్‌ చొప్పున దాల్చిన చెక్క పొడి, తేనె, ఆలివ్‌ నూనె తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని పెదాలపై అప్లై చేసి మునివేళ్లతో స్మూత్​గా మసాజ్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని వాటర్​తో కడిగేసుకొని లిప్‌ బామ్‌ రాసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

నారింజ తొక్కల పొడి, బ్రౌన్ షుగర్ : పొడిబారి నల్లగా కనిపించే పెదాలను మెరిపించడంలో ఈ స్క్రబ్ కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున కమలాఫలం తొక్కల పొడి, బ్రౌన్‌ షుగర్‌ తీసుకొని అందులో కొన్ని చుక్కల బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో 30 సెకన్ల పాటు పెదాలపై మర్దన చేసుకొని కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

2019లో 'కాస్మెటిక్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కమలాఫలం తొక్కలలోని యాంటీఆక్సిడెంట్లు పెదాలను హైడ్రేట్ గా ఉంచడంలో, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘైలోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జియాన్ జియాంగ్ పాల్గొన్నారు. నారింజ తొక్కల పొడితో ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్స్ పెదాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

మగాళ్ల పెదవులు ఎందుకు నల్లగా మారుతాయి?

తేనె, బ్రౌన్‌ షుగర్‌ : ఈ నేచురల్ హోమ్ రెమిడీ పెదాల ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక బౌల్​లో టేబుల్‌స్పూన్‌ చొప్పున తేనె, బ్రౌన్‌ షుగర్‌ తీసుకొని.. అందులో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని పెదాలపై అప్లై చేసి.. రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని వాటర్​తో కడిగేసుకుంటే చాలు.. లిప్స్ మృదువుగా మారతాయంటున్నారు.

కాఫీ పొడి, తేనె : ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో టేబుల్‌స్పూన్‌ చొప్పున బరకగా ఉన్న కాఫీ పొడి, తేనె తీసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో పెదాలపై నెమ్మదిగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు. పొడి బారిన పెదాలు మెరుపును సంతరించుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.

గులాబీ రేకుల పేస్ట్‌ : కొన్ని తాజా గులాబీ రేకులను తీసుకొని వాటికి పచ్చి పాలు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని పెదాలపై అప్లై చేసుకుని కాసేపు స్మూత్​గా మసాజ్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు తేమను తిరిగి పొందడంతో పాటు మంచి రంగుని సొంతం చేసుకుంటాయంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సిగరెట్​తో లిప్స్​ నల్లగా మారాయా? ఈ టిప్స్​తో ఈజీగా తెల్లగా మార్చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.