ETV Bharat / health

ఆ కూరగాయలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్టే! - Eating Raw Vegetables

Avoiding Raw Vegetables : కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. అయినప్పటికీ వాటిల్లో కొన్నింటిని పచ్చిగా తినడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అలా పచ్చిగా తినకూడని కూరగాయలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

RAW VEGETABLES
RAW VEGETABLES (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 6:44 PM IST

Avoiding Raw Vegetables : పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే, వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిందే. అయితే ఎంత మంచివి అయినప్పటకీ కొన్ని కూరగాయలను వండకుండా, అంటే పచ్చిగా తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని కూరగాయల్లో ఆరోగ్యానికి హాని చేసే బీ కొల్లై, టేప్ వార్మ్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలుంటాయి. పచ్చిగా తినడం వల్ల ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లోకి, రక్తనాళాల్లోకి, కొన్ని సార్లు మెదడులోకి కూడా ప్రవేశించి సిస్టిసెర్కోసిస్, మూర్ఛ, తలనొప్పి, కాలేయం దెబ్బతినడం, కండరాలలో తిత్తులు వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే పచ్చిగా అస్సలు తినకూడని కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల ఆకుకూరలు
బచ్చలి కూర, కాలే, చేమదుంప ఆకులు వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. అయితే వీటిని పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. వండేముందు కూడా వీటిని తప్పకుండా వేడి నీటిలో కడగాలి. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ స్థాయిలు, సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం వల్ల గొంతు నొప్పి, మంట, చిరాకు వంటి ఇబ్బందులు కలుగుతాయి.

క్యాబేజీ
క్యాబేజీలో టేప్ వార్మ్​లు, వాటి గుడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటికి కనిపించవు. పైగా క్యాబేజీ పెంపకం సమయంలో క్రిమిసంహారాలు, పురుగుల మందులు ఎక్కువగా వాడతారు. అందుకే క్యాబేజీని పచ్చిగా తినకూడదు. అందుకే బాగా కడిగి, తరువాత వేడి నీటిలో ఉడికించిన తర్వాత మాత్రమే దానిని వండాలి. వీటిని పచ్చిగా తినడం వల్ల థైరాయిడ్ గ్రంథులకు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాప్సికమ్
ఎప్పుడైనా క్యాప్సికమ్ కాడను, లోపల ఉండే గింజలను తీసేసిన తర్వాతే వండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి హానికరమైన క్రీములకు నిలయంగా ఉంటాయి. వీటిని పచ్చిగా అస్సలు తీసుకోకూడదు.

వంకాయ
వంకాయ గింజల్లో కూడా టేప్ వార్మ్ గుడ్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వంకాయను పచ్చిగా తినడం వల్ల ఈ పరాన్నజీవులు రక్తప్రవాహంలోకి వెళ్లి ప్రమాదకరమైన జబ్బులకు కారణమవుతాయి. అందుకే వంకాయలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు.

బెండకాయ
ఈ మధ్య చాలా మంది బెండకాయ గురించి మాట్లాడుకుంటున్నారు. బెండకాయల్లో గుజ్జు ఎక్కువగా ఉంటున్నందున వీటిని తినడం వల్ల ఎముకల్లో గుజ్జు పెరుగుతుందని నమ్ముతారు. అయినప్పటికీ వీటిని పచ్చిగా మాత్రం అస్సలు తినకూడదు అని సూచిస్తున్నారు. పచ్చివి తింటే, వీటిల్లోని ఆల్కలాయిడ్స్ మీలో జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పలు రావడానికి కారణం అవుతాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వాజిలిన్​ను అన్ని రకాలుగా వాడొచ్చా? అవేంటో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా! - Vaseline Benefits

IVF ద్వారా పిల్లలు కనేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బందులు- అన్నీ లింకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.