ETV Bharat / health

హెల్త్​ చెకప్​కు వెళ్లేముందు ఈ తప్పులు చేస్తున్నారా? ఫాల్స్​ రిజల్ట్స్​ వచ్చే అవకాశం! - Health CheckUps Tips

Dos and Don'ts Before Health Check Ups : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంత అవసరమో సమయానికి హెల్త్​ చెకప్స్​ కూడా అంతే ముఖ్యం. అయితే హెల్త్​ చెకప్​కు వెళ్లినప్పుడు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Health Check Ups
health
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 12:00 PM IST

Health Checkups Before Dos and Don'ts : మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్​ హెల్త్​ చెకప్​లు చాలా అవసరం. అయితే, సరైన రిజల్ట్ కోసం వైద్య పరీక్షలు చేయించుకునే ముందు, డాక్టర్​ను సంప్రదించే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. లేదంటే టెస్టుల్లో సరైన ఫలితం రాక అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. మరి చేయకూడని పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హెల్త్ చెకప్స్​కు ముందు చేయకూడనివి :

బీపీ చెకప్​ : ఈ రోజుల్లో ఎక్కువ మంది బీపీ ప్రాబ్లమ్స్​తో ఇబ్బందిపడుతున్నారు. అయితే బీపీ(Blood Pressure) చెకప్​కు వెళ్లే ముందు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటంటే.. బీపీ చెకప్​కి వెళ్లాలనుకుంటే మీ అపాయింట్‌మెంట్‌కు కనీసం ఒక గంటలోపు కాఫీ లేదా ఇతర కెఫిన్ పానీయాలు తాగడం మానుకోవాలి. ఎందుకంటే కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. ఫలితంగా తప్పుడు రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే బీపీ చూయించుకోవడానికి ముందు ధూమపానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు. ఇక బీపీ చెకప్​కు ముందు కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత చెక్ చేయించుకోవడం బెటర్.

రక్తపరీక్ష : చాలా మంది రక్త పరీక్షకు వెళ్లే ముందు కళ్లు తిరుగుతాయనో, ఇంకేదో కారణం చేత కొన్ని పదార్థాలు తిని వెళ్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మీరు బ్లడ్ టెస్ట్​కు వెళ్లే ముందు ఎట్టి పరిస్థితుల్లో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తినొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ పరీక్ష : మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే టెస్ట్​కు ముందు మద్యం సేవించవద్దనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్కహాల్ మీ ట్రైగ్లిజరైడ్‌లను మారుస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పరీక్షకు 24 గంటల ముందు వరకు మద్యం తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకునే ముందు స్వీట్లు కూడా తినకూడదు. ముఖ్యంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలకు సంబంధించిన పరీక్షలు పరగడుపున(8 నుంచి 10 గంటలు) తినకుండా ఉండి చేయించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు!

చర్మవ్యాధి నిపుణుడు : ఏదైనా చర్మ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లయితే డెర్మటాలజిస్ట్​ దగ్గరికి వెళ్లేముందు పెడిక్యూర్, మానిక్యూర్ లాంటివి చేయవద్దంటున్నారు. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు గోర్లు చూసి సమస్యలు ఏంటో చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎలాంటి పాలిష్ లేకుండా క్లీన్​గా ఉంచడం ముఖ్యం. అలాగే మేకప్ లాంటి చర్మాన్ని కప్పి ఉంచే రసాయనాలను వాడకపోవడం మంచిది.

కొలొనోస్కోపీ : మీరు కొలొనోస్కోపీ చేయించుకోవడానికి వెళ్తున్నట్లయితే ఆ టెస్ట్​కు ముందు ఎరుపు, ఊదా రంగు ఆహారాలను తినవద్దంటున్నారు నిపుణులు. అలాగే ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

మూత్ర పరీక్ష : ఈ టెస్టు చేయించుకోవడానికి ముందు బాడీని హైడ్రేట్​గా ఉంచడం చాలా అవసరం. అప్పుడే మెరుగైన సరైన రిజల్ట్ వస్తుంది. కానీ, చాలా మంది డీహైడ్రేట్​గా ఉండి శాంపిల్ ఇస్తుంటారు. అది మంచిది కాదంటున్నారు నిపుణులు.

మామోగ్రామ్ : మీరు ఈ పరీక్ష చేయించుకునే ముందు డియోడరెంట్‌/యాంటిపెర్స్‌పిరెంట్​ని ఉపయోగించవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలో చాలా వరకు అల్యూమినియం ఉంటుంది. మామోగ్రామ్‌లో అల్యూమినియం రొమ్ము కాల్సిఫికేషన్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పుడు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.

హెల్త్ చెకప్స్​కు ముందు చేయాల్సినవి :

  • మీరు ఏదైనా హెల్త్ చెకప్​కు వెళ్లే ముందు లేదా డాక్టర్ అపాయింట్​మెంట్ ఉన్నప్పుడు మీరు సాధారణంగా తీసుకునే ఆహారాన్ని తిని వెళ్లవచ్చు.
  • మీరు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, కొన్ని రోజులు ఆహారపు అలవాట్లను మార్చడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. కాబట్టి మీరు మామూలుగా తిని వెళ్లవచ్చు.
  • అదే విధంగా చెకప్​కు ముందు బాడీ డీ హైడ్రేట్​ కాకుండా తగినంత వాటర్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • ఇక చివరగా మెడికల్ అపాయింట్​మెంట్​కు వెళ్లే ముందు మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు వచ్చే ప్రశ్నలను నోట్ చేసుకొని వెళ్లడం మంచిది.

ముద్దులొలికే చిన్నారులకు ముద్దు పెడుతున్నారా? - వారి ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.