ETV Bharat / health

హెల్త్​ బాలేకపోతే వైద్యులు నాలుకనే ఫస్ట్​ ఎందుకు చూస్తారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? - Why Doctors Check Tongue

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 10:58 AM IST

Why Doctor See Tongue : ఎలాంటి అనారోగ్య సమస్యతో వెళ్లినప్పటికీ డాక్టర్లు మొదటగా నాలుక చూపించమని అడుగుతారు. నాలుకే ఎందుకని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నాలుక ద్వారా వైద్యులు ఏమేం తెలుసుకుంటారంటే?

Why Doctor See Tongue
Why Doctor See Tongue (Getty Images)

Why Doctor See Tongue : శరీరంలోని చాలా భాగాలు మనకున్న ఆరోగ్య సమస్యలను చూపించగలవని మీకు తెలుసా? కాలేయ సమస్యల లక్షణాలు చర్మం ద్వారా తెలుసుకోవచ్చు. మధుమేహ సమస్యను చేతులు, కాళ్లను చూసి కనిపెట్టవచ్చు. అచ్చం అలాగే నాలుక కూడా అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతంగా నిలుస్తుందట. అందుకనే అనారోగ్య సమస్యలతో వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు వారు మొదటగా నాలుక చూపించమని చెబుతుంటారు. ఇంతకీ నాలుక ద్వారా వైద్యులు ఎలాంటి విషయాలను కనిపెట్టగలుగుతారు. దీని గురించి ప్రముఖ థలోండోండెంటిస్ట్ డాక్టర్ వికాస్ పింజ్రా ఏమని వివరించారో చూద్దాం.

వికాస్ పింజ్రా ప్రకారం, నాలుక చాలా ప్రత్యేకమైనది. ఇది శరీరంలోని అసాధారణను త్వరగా పసిగడుతుంది. కొన్ని విటమిన్ లోపాలు, ఇన్ఫెక్షన్ల నుంచి క్యాన్సర్ సమస్య వరకూ చాలా రకాల సమస్యలను నాలుక ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని గుర్తించేది నాలుక కొన్ని సంకేతాలను చూపిస్తుంది. అవేంటంటే?

తెల్లబడటం:
మీ నాలుక తెల్లటి ప్యాచీతో నిండిపోతున్నట్లయితే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ లాసీ వైట్ ప్యాచ్ లైకైన్ ఫ్లానస్​కు సంకేతం కావచ్చు. రోగనిరోధక వ్యవస్థ నోటిలోని కణజాలంపై దాడి చేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ల్యూకోఫ్లాకియాకు సంకేతం కావచ్చు. కాలక్రమేణా ఇది క్యాన్సర్ ను అభివృద్ధి చేస్తుంది.

పగుళ్లు:
చాలా మందికి నాలుకపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇది స్ట్రోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సోరియాసిస్ లకు సంకేతం కావచ్చు. ఇది పూర్తిగా ప్రమాదకరం కానప్పటికీ దీన్ని పరిష్కరించేందుకు నాలుకను శుభ్రంగా ఉంచడం, సున్నింతంగా బ్రష్ చేయడం అవసరం.

ఎర్రటి నాలుక:
నాలుక బాగా ఎర్రగా మారడం నాలుకపై గడ్డలు రావడం వంటివి కవాసకి వ్యాధికి సంకేతం కావచ్చు. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపించే సమస్య. రక్తనాళాల ద్రవోల్బణానికి కారణమయే తీవ్రమైన అరుదైన వ్యాధి ఇది. అలాగే స్కార్లెట్ జ్వరానికి కూడా ఇది సంకేతం కావచ్చు. నోట్లో నొప్పి వస్తూ నాలుక ఎర్రగా మారినట్లయితే ఇది విటమిన్-బీ లోపం కూడా అయి ఉండచ్చు.

నాలుకపై వెంట్రుకలు:
నాలుకపై నట్టి వెంట్రుకల లాంటి పదార్థం ఏర్పడుతున్నట్లయితే మీ మీ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదని అర్థం. ముఖ్యంగా ధూమపానం, ఆల్కాహాల్, ఇతర పానీయాలు తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. క్లోరెక్సిడైన్ మౌత్ వాష్ వాడటం వల్ల కూడా నాలుకపై వెంట్రుకలు వచ్చే అవకాశముంది.

మృదువైన నాలుక:
నోరు నిగనిగలాడుతూ మృదువుగా మారిందంటే మీరు పోషకాల కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు లెక్క. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్లు లోపించడం వల్ల ఇన్ఫెక్షన్లు, సెలియాక్ డిజీజ్ వంటివి మీ నాలుకను మృదువుగా, ఎర్రగా మారుస్తాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.