Healthy Eating : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్‌డ్ డైట్ తప్పనిసరి. పండ్లు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం. ప్రోసెస్‌డ్ ఫుడ్స్, షుగర్స్, అనారోగ్యకరమైన కొవ్వులను నియంత్రించుకోవడం వంటివి చేస్తుండాలి.
ఇవి సరైన రీతిలో తీసుకుంటేనే ఆరోగ్య వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మంచి బరువు, రిస్కులు లేని జీవనం మన సొంతమవుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీ లాంటివి దరి చేరవు. ఇవన్నీ సాధ్యపడేందుకు ఆరోగ్యంగా తినడమెలాగో కొన్ని పద్దతుల ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఏం తినాలో ముందుగానే నిర్ణయించుకోవాలి
మనం తినే ఆహారంపై మనకు అవగాహన ఉండాలి. ఏం తినాలో అనేది ముందుగా ప్లానింగ్ చేసుకోండి. ఏరోజు ఏం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మన రోజువారి డైట్లో ఆ ఆహారాన్నిసిద్ధం చేసుకోవాలి.
లెక్కపెట్టుకుని తినండి
తినే టప్పుడు చిన్న ప్లేట్స్, బౌల్స్, గిన్నెల్లాంటి పాత్రలు ఉపయోగించి మీరు తీసుకునే ఆహారాన్ని అదుపులో పెట్టుకోండి. ఆకలి వేస్తుందని ఎక్కువగా తినకూడదు. చిన్న గిన్నెలలో తినడం అలవాటు చేసుకుంటే ఎక్కువగా తినే సమస్య నుంచి బయటపడతారు.
ఎక్కువగా తీసుకోవాల్సినవి
పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. షుగర్, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ప్రోసెస్‌డ్ ఫుడ్‌ను పక్కన పెట్టేయండి. పోషకాలైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.
హైడ్రేట్‌డ్‌గా ఉండండి
రోజు మొత్తంలో ఎక్కువగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని మర్చిపోకండి. మీ యాక్టివిటీ లెవల్‌ను, వాతావరణాన్ని బట్టి ఆ లిమిట్ పెంచుకున్నా మంచిదే. అలా చేయడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. శక్తి స్థాయిలు సమానంగా కొనసాగుతాయి.
కొద్దిగే స్నాక్స్
భోజనానికీ భోజనానికి మధ్యలో తీసుకునే స్నాక్స్ సైతం కెలరీలును అందిస్తాయి. అవే మన బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ఎక్కువగా ఆహారం తినేయకుండా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే పరిమితంగా ఆహారం తీసుకోవడం మంచిది.
మనస్ఫూర్తిగా తినండి
ఆహారం తీసుకునే సమయంలో మనం తినే ముద్దను ఆస్వాదించాలి. టీవీ చూస్తూనో, స్మార్ట్ ఫోన్ వాడుతూనో ఆహారం తింటే మీరు తిన్నట్లు కాదు, మింగినట్లు అవుతుంది. తినే ఆహారంపై మనసు పెట్టి తింటేనే ఆకలి తీరుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.