Diaper Rash Treatment For Babies : చంటిపిల్లలకు డైపర్లు వాడటం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డైపర్లను గంటల తరబడి అలాగే ఉంచడం వల్ల పిల్లల లేత చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఒక్కోసారి మలమూత్ర విసర్జన కారణంగా పిల్లల చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పసిపిల్లల్ని చికాకు పెట్టే 'డైపర్ రాషెస్' నివారణా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసిపిల్లలకు డైపర్లను వాడటం మంచిదేనా ?
ఒకప్పుడు చిన్నపిల్లలకు కాటన్ వస్త్రాలు కట్టేవారు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలకు డైపర్లు వేస్తున్నారు. కానీ డైపర్ల వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే డైపర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
డైపర్ రాషెస్ ఎందుకొస్తాయి ?
సహజంగా మనం డైపర్లను రెండు మూడు గంటలకోసారి మారుస్తూ ఉండాలి. తక్కువ నాణ్యత గల డైపర్లైతే అవి తడిగా మారి రాషెస్ వచ్చే అవకాశముంటుంది. రాషెస్ రావడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అవి :
- గాలి సరిగ్గా ఆడకపోవడం : చిన్న పిల్లలు మలమూత్రాలు విసర్జిస్తారు. కానీ వాళ్లు పెద్దవాళ్లకు చెప్పలేరు. దీనితో మలమూత్రాల నుంచి వచ్చే టాక్సిన్స్ పిల్లల చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి.
- డైపర్లలో ఉండే రసాయనాల ప్రభావం
- కాటన్ డైపర్స్‌ను హైపవర్డ్ డిటర్జెంట్లతో ఉతకడం.
డైపర్లతో ఇంకా ఏయే సమస్యలు వస్తాయి?
డైపర్ల వల్ల దద్దుర్లతో పాటు కొన్ని రకాల అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా పిల్లలకు చాలా చికాకు కలుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే అనారోగ్యం బారిన పడతారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వీలైనంత వరకు మంచి డైపర్లను ఎంచుకోవాలి. కాటన్ డైపర్లు అయితే వాటిని ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు. ఉతికి ఆరేసి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. అదే డిస్పోసబుల్ డైపర్స్ అయితే వాడిన తరువాత ఎప్పటికప్పుడు పడేయొచ్చు. కానీ ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. మీరు కనుక కాటన్ డైపర్లు వాడితే, వాటిని ఉతికిన తర్వాత అందులోని డిటర్జెంట్ అంతా పోయేవరకు వేడి నీటిలో శుభ్రంగా కడిగి తర్వాత వాడుకోవాలి. వీటిని కొన్న వెంటనే కాకుండా 2, 3 సార్లు ఉతికిన తర్వాతే ఉపయోగించడం మంచిది. డిస్పోసబుల్ డైపర్స్ వాడుతున్నప్పుడు వాటిని వాడే ముందు క్రీమ్ రాసి ఉపయోగించడం మంచిది. దీని వల్ల చాలా వరకు దద్దుర్లు రాకుండా నివారించవచ్చు.
డైపర్ రాషెస్‌కు వైద్య నిపుణుల సూచనలు
- పిల్లలకు డైపర్లను ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి తప్పకుండా మార్చాలి.
- గాలి తగిలేలా చూసుకోవాలి.
- రోజూ కొంత సేపు డైపర్ లేకుండా పిల్లల్ని ఉంచాలి.
- రాషెస్ బాగా వస్తే జింక్ ఆక్సైడ్, సిలికాన్ బేస్ రాష్ క్రీమ్స్ ఉంటాయి.
- ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.
- దద్దుర్లు ఎక్కువగా ఉంటే తక్కువ మోతాదులో స్టిరాయిడ్స్ వాడాల్సి రావచ్చు. కానీ వైద్యుల సూచనలు మేరకే వాటిని వాడాలి.
- పిల్లల చర్మంపై తడి లేకుండా చూడాలి.
- మంచి నాణ్యమైన డైపర్లను మాత్రమే వాడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డయాబెటిస్ తగ్గుతుందని హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారా? మీరు డేంజర్లో ఉన్నట్లే!
జుట్టు భారీగా ఊడిపోతోందా? - ఇంట్లో దొరికే హెయిర్ మాస్క్‌లతో రిజల్ట్ పక్కా!