ETV Bharat / health

మీరు రోజూ పెరుగు తింటున్నారా? - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Curd Reduces Lung Cancer Risk

Curd Reduces Lung Cancer Risk : పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. మరి.. క్రమం తప్పకుండా రోజూ పెరుగు తింటే శరీరంలో ఏం జరుగుతుంది??

Lung Cancer Risk
Curd Reduces Lung Cancer Risk (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 1:43 PM IST

Curd Reduces Lung Cancer Risk : ప్రస్తుత కాలంలో మనం ఆరోగ్యం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనేక రకాల వ్యాధులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇలా జబ్బులు రావడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్‌, మందు తాగడం వంటివి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్‌ చేయడం వల్ల ప్రధానంగా లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. అయితే.. కొంత మందికి స్మోకింగ్‌ అలవాటు లేకపోయినా కూడా ఈ క్యాన్సర్‌ వస్తుంది.

పొగతాగే వారి పక్కన ఉండడం.. కాలుష్య కాసారాల్లో జీవనం సాగించడం.. జీవనశైలిలో మార్పుల వల్ల కూడా లంగ్ క్యాన్సర్‌ వస్తుందని నిపుణులంటున్నారు. అయితే.. పెరుగు తినడం వల్ల లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు అని కొందరు భావిస్తుంటారు. మరి.. ఇది నిజమేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ముప్పును తగ్గించుకోవచ్చు!
చాలా మంది భోజనం చేసిన తర్వాత చివరలో.. పెరుగుతో అన్నం తినకుండా ఉండలేరు. అయితే.. పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. రోజూ పెరుగు తినడం వల్ల లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి.

2017లో "European Journal of Cancer Prevention" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు 50 గ్రాముల పెరుగు (సుమారు 1/2 కప్పు) తినే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ కు చెందిన 'డాక్టర్ లిన్ గావో' పాల్గొన్నారు. రోజూ పెరుగు తినడం వల్ల లంగ్ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నీటికి కూల్​ డ్రింక్స్​ ప్రత్యామ్నాయం కాదు- అవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పు!: ICMR - ICMR Dietary Guidelines For Indians

పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు :

  • పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనిని రోజూ తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
  • పెరుగులో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయని నిపుణులంటున్నారు.
  • గర్భిణులకు పెరుగు ఎంతో మేలు చేస్తుంది. రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ మంచి స్థాయిలో ఉండడానికి పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందిస్తుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • మనం భోజనంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా త్వరగా ఆకలి వేయకుండా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కోడిగుడ్లతో కలిపి ఇవి తింటున్నారా? - ఆరోగ్యానికి ముప్పు గ్యారెంటీ! - Food Should Be Avoided With Eggs

మెట్లు ఎక్కడం వల్ల ఇన్ని ప్రయోజనాలా! తెలిస్తే అసలు లిఫ్ట్​ వైపే చూడరు!! - Stair Climbing Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.