ETV Bharat / health

మండుతున్న ఎండల్లో చల్లచల్లగా కూల్ ​డ్రింక్స్ తాగుతున్నారా? - పొట్టలోకి వెళ్లి ఏం చేస్తాయో మీకు తెలుసా? - Cool Drinks Side Effects in Summer - COOL DRINKS SIDE EFFECTS IN SUMMER

Drinking Cool Drinks Side Effects : వేసవిలో ఎండవేడిమి తాళలేక చాలా మంది శీతల పానీయాలు తాగుతుంటారు. ఈ కూల్ డ్రింక్స్ చల్ల చల్లగా గొంతు దిగుతాయని మాత్రమే అందరికీ తెలుసు. కానీ.. లోపలికి వెళ్లిన తర్వాత ఏం చేస్తాయో మాత్రం చాలా మందికి తెలియదు. మరి.. మీకు తెలుసా?

Cool Drinks
Cool Drinks Side Effects
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 1:30 PM IST

Side Effects of Drinking Cool Drinks : సమ్మర్​లో కూల్​డ్రింక్స్(Cool Drinks), సోడా వంటివి తాగితే.. ఎండ వేడి నుంచి వెంటనే రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

బరువు పెరుగుతారు : సాధార‌ణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్​లో 150-200 కేల‌రీలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూల్​ డ్రింక్​లో అధిక ఫ్ర‌క్టోజ్ ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ‌లితంగా.. డ‌యాబెటిస్, బీపీ, గుండె జ‌బ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సమ్మర్​లోనే కాదు ఏ కాలంలోనైనా వీలైనంత వరకు కూల్​డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు.

జీర్ణ సమస్యలు : కూల్ డ్రింక్స్​లో ఫాస్ప‌రిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్య‌వస్థ దెబ్బ‌తింటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావ‌డానికి కాంపనెంట్ హైడ్రాలిక్ యాసిడ్​ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న పొట్ట‌లోనే ఉత్ప‌త్తి అవుతుంది. కూల్​డ్రింక్స్ తాగిన‌ప్పుడు అందులో ఉండే రసాయ‌నం ఈ యాసిడ్​తో క‌లిసిన‌ప్పుడు జీవ‌క్రియ‌ల మీద విప‌రీత‌మైన ప్ర‌భావం ప‌డుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వివిధ జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

ఫ్యాటీ లివర్ సమస్య : కూల్​డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉందట. శీతలపానీయాలు తీసుకోవడం వల్ల అదనపు పరిమాణం ఫ్రక్టోజ్ కాలేయానికి చేరుకుంటుంది. దాంతో అది ఓవర్​లోడ్ అయ్యి కొవ్వుగా మారుతుందంటున్నారు. దీని కారణంగా లివర్​లో కొవ్వు పేరుకుపోవడం స్టార్ట్ అవుతుందట. ఫలితంగా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

2020లో 'హెపటాలజీ' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సమ్మర్​లో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వ్యక్తులకు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయ వాపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ జోసెఫ్ టి. కాల్‌ఫ్లైష్ పాల్గొన్నారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వ్యక్తులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

హీట్ స్ట్రోక్ - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

అధిక రక్తపోటు : వేసవిలో డీహైడ్రేష‌న్ త‌ప్పించుకోవ‌డానికి అనేక మంది కూల్​డ్రింక్స్​ తాగుతారు. కానీ.. అందులోని కెఫిన్, చక్క‌ెర‌లు మ‌రింత డీహైడ్రేష‌న్​కు దారితీస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కెఫిన్ వ‌ల్ల అధిక రక్త‌పోటు, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌నకు వెళ్లాల్సి రావ‌టం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయంటున్నారు.

అంతేకాకుండా.. ఆ ర‌సాయ‌నాలు ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు దారితీస్తాయని చెబుతున్నారు నిపుణులు. షుగ‌ర్ కంటెంట్ ఉండ‌టం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లూ వ‌స్తాయంటున్నారు. అంతేకాదు.. చిగుళ్లు వ‌దులై దంతాలు ఊడిపోయే ప్ర‌మాద‌ం ఉందని చెబుతున్నారు నిపుణులు. కూల్​డ్రింక్స్​లోని అధిక ఫ్ర‌క్టోజ్ వ‌ల్ల బ్రెయిన్​లోని హిప్పోక్యాంప‌స్ ప‌రిమాణం త‌గ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఫ‌లితంగా.. మ‌తిమ‌రుపు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. చివరగా.. ఈ పానీయాలు అనారోగ్యకర బ‌రువును పెంచుతాయే త‌ప్ప ఎలాంటి ప్ర‌యోజనమూ ఉండ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే, వేసవిలో ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే ఈ పానీయాల‌కు బ‌దులు.. ఖ‌ర్బుజ, పుచ్చ‌కాయ‌, ఇత‌ర పండ్ల ర‌సాలు తీసుకోవడం మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తిన్న తర్వాత కూల్​డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.