ETV Bharat / health

మండే ఎండల్లో కూల్​ వాటర్ తాగుతున్నారా? - అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు! - Cold Water side effects - COLD WATER SIDE EFFECTS

Drinking Cold Water Side Effects : సమ్మర్​లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చల్లగా ఉండే నీళ్లు తాగాలనిపించడం కామన్. అలా గొంతులోకి కూల్ వాటర్ వెళ్తుంటే హాయిగా అనిపిస్తుంది. కానీ, వేసవిలో కూల్ వాటర్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చల్లని వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

Cold Water Side Effects
Cold Water
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 12:50 PM IST

Side Effects of Drinking Cold Water in Summer : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటక ముందే నడినెత్తున సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి ఆహారాలు, పానీయాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందడానికి మెజార్టీ జనం ఫ్రిడ్జ్​లోని నీళ్లను తాగుతుంటారు. అయితే, అలా తీసుకోవడం అప్పటివరకు తక్షణ ఉపశమనాన్ని అందించిన.. తర్వాతర్వాత ఈ పద్ధతి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సమ్మర్​లో కూల్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణక్రియ నెమ్మదిస్తుంది : సమ్మర్​లో చల్లని నీరు తాగడం జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుందంటున్నారు. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్​ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

2019లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. సమ్మర్​లో చల్లని నీరు తాగడం జీర్ణక్రియను నెమ్మదించే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన గాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్. లియోనార్డో పాల్గొన్నారు. సమ్మర్​లో ఎక్కువగా కూల్ వాటర్ తాగితే జీర్ణ ఎంజైమ్​ల పనితీరు తగ్గి అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు.

దంతాల ఆరోగ్యంపై ప్రభావం : వేసవిలో చాలా కూల్​గా ఉండే వాటర్ తాగడం దంత ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చల్లని నీటి ఉష్ణోగ్రతలు దంతాల సున్నితత్వాన్ని పెంచే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్​ను ప్రభావితం చేసి పళ్లను మరింత సున్నితంగా మార్చవచ్చంటున్నారు నిపుణులు.

శ్వాసకోశ సమస్యలు వస్తాయి : సమ్మర్​లో ఎక్కువగా చల్లని నీటిని తాగడం శ్వాసకోశ వ్యవస్థలో శ్లేష్మ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా మీ గొంతులో శ్లేష్మం పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ లేదా అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలకు గురయ్యే వ్యక్తులలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చంటున్నారు నిపుణులు.

మీకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత - కొబ్బరి తినే అలవాటు ఉందా? - ఏం జరుగుతుందో తెలుసా!

తలనొప్పిని తీవ్రం చేస్తుంది : కొందరికి చాలా చల్లని నీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి లేదా మైగ్రేన్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కూల్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో కలిగే ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు తలలో రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. అది అసౌకర్యం లేదా తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.

జీవక్రియలకు అంతరాయం : కొన్ని అధ్యయనాలు చల్లటి నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియ రేటు తాత్కాలికంగా దెబ్బతింటుందని సూచిస్తున్నాయి. అయితే.. దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ చాలా కూల్​గా ఉండే వాటర్ తీసుకోవడం కాలక్రమేణా జీవక్రియ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది : సమ్మర్​లో చల్లని వాటర్ తాగడం రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోగనిరోధక బలహీనపడవచ్చంటున్నారు. ఫలితంగా అంటువ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవేకాదు.. సమ్మర్​లో కూల్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బాడీ అసంకల్పిత విధులను నియంత్రించే నాడిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా నాడీ వ్యవస్థపై ప్రభావం పడి హార్ట్ బీటింగ్ రేట్ తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి.. ఫ్రిజ్ నీళ్లు, ఐస్ వాటర్​ లేదా కూల్ వాటర్​ను అతిగా తీసుకోకపోవడం మంచిది అంటున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేసవిలో జలుబును తగ్గించుకోవడం ఎలా? మీకోసం 5 సింపుల్ టిప్స్! - Summer Cold Remedies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.