ETV Bharat / health

రోజూ 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగుతున్నారా ? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

Coffee Side Effects : ఉదయాన్నే కమ్మటి కాఫీ వాసన ముక్కులకు తగలగానే బాడీ అంతా యాక్టివ్​ అవుతుంది. అలా ఉదయం మొదలు.. రాత్రి పడుకునే వరకు మొత్తం మీద ఓ నాలుగైదు కప్పుల కాఫీ ఈజీగా తాగేస్తారు. ఎప్పుడో ఓ సారి ఇలా అయితే ఓకే, కానీ.. ప్రతిరోజు నాలుగు కప్పులకు మించి కాఫీ తాగితే డేంజర్ తప్పదంటున్నారు నిపుణులు. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం..

Coffee Side Effects
Coffee Side Effects
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 1:19 PM IST

Coffee Health Problems : కాఫీ.. ఈ పేరు విన్నా, దాని వాసన పీల్చినా ఓ వైబ్రేషన్​ వస్తుందని ఫీలవుతారు చాలా మంది. ఉదయం కాఫీ తాగందే ఏ పనులు కూడా మొదలుపెట్టరు. అంతలా కాఫీలు మన జీవితాల్లో ఒక అలవాటుగా కాదు కాదు వ్యసనంలా మారిపోయాయి. అయితే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ సిప్ తాగితే ఎంతో రిలీఫ్​గా ఉంటుంది.​ అలాగే తలనొప్పి, అలసట వంటివి వచ్చినా ఒక కప్పు కాఫీ తాగితే అన్నీ సెట్‌ అవుతాయి. అలా అని ఆరోగ్యానికి మంచిది కదా అని అధికంగా తీసుకుంటే ఏదైనా ప్రమాదమే. అందుకు కాఫీ మినహాయింపు ఏమీ కాదు. అందుకే రోజూ నాలుగు కప్పులకు మించి(400mg) కాఫీ తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే డేంజర్​ తప్పందంటున్నారు..

రోజూ కాఫీ ఎక్కువ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు :

నిద్రలేమి సమస్య : రోజూ ఎక్కువగా కాఫీ తాగడం వల్ల మనం కంటి నిండా నిద్రకు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలికంగా కాఫీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2013లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్' లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగిన వారిలో నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

చికాకు, భయం : రోజుకు నాలుగు కప్పులకు మించి కాఫీని ఎక్కువగా తాగడం వల్ల కొంత మందిలో చికాకు, భయం కలగవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కెఫిన్‌ మన శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. ఇంకా ఉద్రేకాన్ని పెంచుతుందని అంటున్నారు.

గుండె దడ : రోజూ అధిక మొత్తంలో కాఫీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్‌ శాతం పెరుగుతుంది. దీనివల్ల గుండె దడ, హృదయ స్పందన రేటులో మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులంటున్నారు.

ఇంకా :

  • ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల గుండెలో మంట, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.
  • రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. ముందు నుంచి బీపీ సమస్యతో బాధపడేవారిలో ఈ సమస్య మరింత తీవ్రతరం కావొచ్చు.
  • కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని.. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ గురవుతుందని అంటున్నారు.
  • ఇంకా కాఫీ ఎక్కువగా తాగితే భవిష్యత్తులో శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని.. అందుకే కాఫీని మితంగా తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

సోషల్‌ మీడియాతో - "పాప్‌కార్న్‌ బ్రెయిన్‌" ముప్పు - అసలేంటిది!

ఈజీగా వెయిట్​ లాస్​ అవ్వాలనుకుంటున్నారా? - అయితే ఈ చియా సీడ్స్ రెసిపీలు ట్రై చేయాల్సిందే!

రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.