ETV Bharat / health

కొబ్బరి నీళ్లు Vs లెమన్‌ వాటర్‌- సమ్మర్​లో ఏ డ్రింక్​ బెస్ట్​! నిపుణుల మాటేంటి! - Coconut Or Lemon Water Which better - COCONUT OR LEMON WATER WHICH BETTER

Coconut Or Lemon Water Which Gives Better Hydration: సమ్మర్‌లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. దీంతో చాలా మంది కొబ్బరినీళ్లు, లెమన్‌ వాటర్​కు ఓటేస్తారు. అయితే చాలా మందికి ఈ రెండింటిలో ఏది బెస్ట్​ డ్రింక్​? బాడీని హైడ్రేట్​గా ఉంచడంలో ఏ డ్రింక్​ ఉపయోగపడుతుంది? అనే డౌట్స్​ వస్తాయి. మరి దీనిపై నిపుణుల మాటేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Coconut Or Lemon Water Which Gives Better Hydration

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 3:00 PM IST

Coconut Or Lemon Water Which Gives Better Hydration: రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినవారు ఎండవేడి, ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు కూల్‌డ్రింక్స్‌, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, జ్యూసులు వంటి పానీయాలను తాగుతున్నారు. అయితే చాలా మందికి కొబ్బరి నీళ్లు, లెమన్​ వాటర్​.. ఈ రెండింటిలో బెస్ట్​ డ్రింక్ ఏంటి​? బాడీని హైడ్రేట్​గా ఉంచడంలో ఏ డ్రింక్​ ఉపయోగపడుతుంది? అనే డౌట్స్​ వస్తాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరినీళ్లు : సమ్మర్‌లో ఎండవేడి, ఉక్కపోత కారణంగా చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల చాలా మంది డీహైడ్రేషన్‌ సమస్యను ఎదుర్కొంటారు. అయితే, సమ్మర్‌లో డైలీ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రోలైట్లు మనకు తక్షణ శక్తిని అందిస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. కొబ్బరి నీళ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా కొబ్బరి నీళ్లలో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ వాటర్​ బెస్ట్​ అంటున్నారు నిపుణులు.

సమ్మర్​లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ!

2018లో "జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్‌ మెడిసిన్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసేవారు మంచినీళ్లను తాగడం కంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యను తక్కువగా ఎదుర్కొన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్. డేవిడ్ గ్రాబ్ పాల్గొన్నారు. డైలీ వ్యాయామం చేసేవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యను తక్కువగా ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు.

నిమ్మకాయ నీళ్లు : లెమన్‌ వాటర్‌లో విటమిస్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధకశక్తిని పెంచి కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే గాయాలు త్వరగా నయం కావడానికి తోడ్పడతుంది. సమ్మర్‌లో లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల మన శరీరం త్వరగా హైడ్రేట్‌ అవుతుంది. అలాగే నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకా సమ్మర్‌లో లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు.

రెండింటిలో ఏది మంచిది?: సమ్మర్‌లో బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రెండూ దాదాపు సమానంగా పని చేస్తాయని నిపుణులంటున్నారు. రెండింటీలో కూడా పోషకాలు సమానంగా ఉన్నాయంటున్నారు. ఏది తాగినా కూడా ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే, మీరు షుగర్‌ వ్యాధితో బాధపడుతుంటే లెమన్‌ వాటర్‌ తాగమని సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగడం మంచిదని అంటున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్ర లేవకుండా అలారం స్నూజ్ చేస్తున్నారా? - చేజేతులా చేసుకుంటున్నట్టే! -

వ్యాయామం చేశాక ఈ ఫుడ్స్ అస్సలు తినకండి - లేదంటే మీరు పడ్డ కష్టమంతా బూడిదపాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.