ETV Bharat / health

వాతావరణ మార్పులతో బ్రెయిన్​పై తీవ్ర ప్రభావం- ఉష్ణోగ్రతలతో వారికి చాలా డేంజర్! - Climate Change Impact On brain

Climate Change Impact On Human Brain : వాతావరణంలో వచ్చే మార్పులు మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై ప్రభావం చూపుతాయని ఓ పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పుల వల్ల రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి నిద్రలేమిని కలిగిస్తాయని, దీంతో మెదడుపై ఆ ప్రభావం పడుతుందని పేర్కొంది.

Climate Change Impact On Human Brain
Climate Change Impact On Human Brain (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 10:36 AM IST

Climate Change Impact On Human Brain : వాతావరణంలో వచ్చే మార్పులు మైగ్రేన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ది లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. వాతావరణ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీకి చెందిన ప్రధాన పరిశోధకుడు సంజయ్ సిసోదియా వాతావరణ మార్పుల వల్ల కలిగే అనార్థాలను వివరించారు.

"రాత్రివేళలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో నిద్రలేమి ఏర్పడుతుంది. సరిగ్గా నిద్రలేకపోవడం ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. 1968-2023 వరకు ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలను పరిశీలించాం. మైగ్రేన్, అల్జీమర్స్, మెనింజైటిస్, ఎపిలెప్సీ, స్ట్రోక్, మల్టిపుల్ స్కెరోసిస్‌ సహా 19 నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు జరిపాం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా వైకల్యాలు, మరణాలు పెరిగాయి. వైకల్యంతో బాధపడేవారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదలు, అడవులు కాలిపోవడం వంటివి వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులు ఆందోళన, నిరాశ, స్కిజోఫ్రెనియాతో సహా అనేక వ్యాధులతో బాధపడేవారిని ప్రభావితం చేస్తున్నాయి. మెదడు ఆరోగ్యం ఆందోళన, మానసిక రుగ్మలతో దెబ్బతింటుంది" అని సంజయ్ సిసోదియా తెలిపారు.

ట్రాఫిక్​ సౌండ్​తో గుండె డ్యామేజ్​- డయాబెటిస్​, బ్రెయిన్​ స్ట్రోక్​కు ఛాన్స్!​
శబ్ద కాలుష్యం హృదయ సంబంధిత వ్యాధులను పెంచుతుందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఇటీవలే తేల్చింది. రోడ్డు, రైళ్లు, విమానాల రాకపోకల వల్ల వచ్చే శబ్దం గుండె పోటు, దాని సంబంధిత వ్యాధులను పెంచుతోందట. ఈ మేరకు అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. అందులో వివరాలు ఉన్నాయిలా!

అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం
ట్రాఫిక్ నుంచి వచ్చే ప్రతి 10 డెసిబుల్స్ శబ్దం గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం సహా హృదయ సంబంధ వ్యాధులను పెంచే ప్రమాదం 3.2 శాతం అధికంగా ఉంది. ముఖ్యంగా రాత్రి వేళ ట్రాఫిక్​లో వచ్చే శబ్దం ప్రజల నిద్ర సమయాన్ని తగ్గిస్తుంది. అంతేగాక రక్త నాళాల్లో ఒత్తిడిని పెంచుతుంది. తద్వారా మెదడు వాపు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడితే విటమిన్‌-D అందదా? నిజమెంత? - Sunscreen Vitamin D Issue

'ఆ ఏజ్​ గ్రూప్​ వాళ్లకు ఎక్కువగా షుగర్, బీపీ- 50శాతం పెరిగిన మరణాలు' - Deaths With Health Issues

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.