How to Reduce Cholesterol without Medication: మన శరీరంలో LDL(చెడు కొలెస్ట్రాల్), HDL(మంచి కొలెస్ట్రాల్) అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి హార్ట్ ఎటాక్, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే తినే ఫుడ్‌ని తగ్గిస్తుంటారు. అలాకాకుండా ఆరోగ్యకరంగా మీరు కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయులను తగ్గించుకోవచ్చని తెలుసా? అందుకోసం మీరు చేయాల్సిందల్లా నిపుణులు సూచించినట్లు.. మీ ఆహారం, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడమే! ఇంతకీ.. ఆ మార్పులేెంటో స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలో రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో 20% మాత్రమే మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందని ఎక్కువ మందికి తెలియదు. అంటే.. కాలేయం, పేగులు మిగిలిన కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తాయన్నమాట. అయితే.. మనం తీసుకునే ఆహారంలో చాలా వరకు కొలెస్ట్రాల్.. మాంసం, పాలు వంటి జంతు సంబంధిత ఆహారాల నుంచి బాడీలో చేరుతుంది. అందుకు ప్రధాన కారణం.. వాటిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులే అని చెప్పుకోవచ్చు. ఇవే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయంటున్నారు నిపుణులు.
అందుకే.. మీరు మొదటగా చేయాల్సిన పని డైలీ డైట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించేలా చూసుకోవాలి. వాటికి బదులుగా అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే వాటిని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అంటే.. కొన్ని రకాల కూరగాయ నూనెలు, అవకాడోలు, కొవ్వు చేపలు వంటివి తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ పుష్కలంగా ఉండే మొక్కల ఆహారాలు అంటే.. కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి డైలీ డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు. అలాగే.. చీజ్‌బర్గర్‌లు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
అలర్ట్ ఎవ్రీవన్ : మారిపోయిన కొలెస్ట్రాల్ లెక్కలు - తొలిసారి CSI మార్గదర్శకాలు - అంతకు మించితే అంతే!
మీ డైట్లో ఇవి చేర్చుకోండి : ఇప్పుడు చెప్పబోయే మూడు డైటరీ సప్లిమెంట్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అవేంటంటే..
సైలియం పొట్టు : ఇది Plantago ovata మొక్కల విత్తనాల నుంచి తయారైన ఒక రకమైన ఫైబర్. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది. సైలియం పొట్టు లేదా పొడి అనేది వాఫర్స్, బార్స్, క్యాప్సూల్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. కాబట్టి కొద్దిగా సైలియం పొడిని వాటర్‌లో కలిపి లేదా ఏదైనా జ్యూస్‌లలో కలిపి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు!
2000లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. సైలియం పొడిని రోజూ 5 నుంచి 10 గ్రాములు ఒకటి లేదా రెండు నెలలు తీసుకోవడం వల్ల సగటున 6 పాయింట్లు LDL కొలెస్ట్రాల్‌ను(National Library of Medicine రిపోర్టు) తగ్గించుకోవచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని లెక్సింగ్టన్లోని University of Kentuckyకి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ J W అండర్సన్ పాల్గొన్నారు.
ప్లాంట్ స్టెరాల్స్ : గింజలు, సోయాబీన్స్, బఠాణీలు వంటి మొక్కల కణ త్వచాల నుంచి తయారుచేసే ప్లాంట్ స్టెరాల్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ప్లాంట్ స్టెరాల్స్నే ఫైటోస్టెరాల్స్ అని కూడా అంటారు. ఇవి క్యాప్సూల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని అధ్యయనాలు కనీసం ఎనిమిది వారాల పాటు రోజుకు 2 గ్రాముల ప్లాంట్ స్టెరాల్స్ తీసుకోవడం వల్ల LDLని 10% వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. అలాగే.. రెడ్ ఈస్ట్ బియ్యంతో(Harvard Medical School రిపోర్టు) ప్రిపేర్ చేసే డైటరీ సప్లిమెంట్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గాలని మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ - ఈ నేచురల్ పద్ధతులతో ఇట్టే కరిగిపోద్ది!