ETV Bharat / health

కూరలో నూనె ఎక్కువైందా ?- ఈ టిప్స్​తో ఆయిల్​ తగ్గడమే కాదు టేస్ట్​ కూడా సూపర్​!

Tips for Reduce Excess Oil in Foods: ఎంతో ఇష్టంగా వండుకున్న కూరలో ఒక్కోసారి అనుకోకుండా ఆయిల్ ఎక్కువవుతుంది. అప్పుడు ఆ కర్రీని తినాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటాం. పైగా నూనె ఎక్కువగా ఉన్నదాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. కాబట్టి ఆ టైమ్​లో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే కర్రీలో అదనపు నూనె తగ్గడమే కాదు.. మరింత రుచికరంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Oil
Reduce Excess Oil in Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 11:00 AM IST

Best Tips for Reduce Excess Oil in Your Foods: కూరలో సరిపడా ఆయిల్, ఉప్పు, కారం, మసాలాలు వేసుకున్నప్పుడే అది రుచికరంగా ఉంటుంది. అందులో ఏది ఎక్కువైనా కూర రుచే మారిపోతుంది. ముఖ్యంగా నూనె ఎక్కువైతే.. ఆ కూర చప్పగా ఉండి అస్సలు తినాలనిపించదు. అలాగే నూనె(Oil) అధికంగా ఉన్నవి తీసుకుంటే ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. ఎంతో కష్టపడి వండిన వంట ఆయిల్ ఎక్కువయిందనే కారణంగా పక్కన పెట్టేస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే అలాంటి సమయంలో ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ గుర్తుంచుకుంటే చాలు.. వండిన వంట నుంచి ఈజీగా నూనెను తొలగించి ఎంతో రుచికరంగా మార్చవచ్చు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బ్రెడ్ : కూరలో నూనె ఎక్కువ అయినప్పుడు మీ కిచెన్​లో బ్రెడ్ అందుబాటులో ఉంటే వాటితో ఈజీగా ఆయిల్ తొలగించవచ్చు. ఇందుకోసం మీరు బ్రెడ్ ముక్కలను కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని నూనె ఎక్కువైన కర్రీలో కలపాలి. అవసరమయితే వేడి చేయాలి. అంతే కూరలోని అదనపు ఆయిల్​ను బ్రెడ్ ముక్కలు గ్రహించి.. రుచిని అలాగే ఉంచుతాయి. ఆ తర్వాత వాటిని తీసేసి నోరూరించే ఆ కర్రీని తినవచ్చు.

ఉడికించిన బంగాళదుంపలు : ఇవి కూడా మీరు చేసిన కూరలో నూనె ఎక్కువ అయితే తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం మీరు కొన్ని ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని.. ఆయిల్ ఎక్కువ ఉన్న కూరలో వేసి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించాలి. అప్పుడు కర్రీలోని అదనపు నూనెను బంగాళదుంపలు గ్రహిస్తాయి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ టేస్టీ కర్రీని తినొచ్చు.

ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మేలు..!

టమాటా ప్యూరీ : మీరు చేసిన కూరలో నూనె ఎక్కువ అయినప్పుడు దానిని తొలగించడంలో టమాటా ప్యూరీ చాలా బాగా పనిచేస్తుంది. మొదటగా మీరు ఒక చెంచా తీసుకుని కూర పైన తేలుతున్న నూనెను తొలగించాలి. ఆ తర్వాత దానికి టమాటా ప్యూరీని యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా కూరలో నూనె తగ్గిపోవడంతోపాటు రుచి కూడా పెరుగుతుంది.

మొక్కజొన్న పిండి : ఆహారం నుంచి నూనెను తగ్గించడానికి మొక్కజొన్న పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా కొన్ని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా మొక్కజొన్న పిండిని వేసి సరిగ్గా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత దానిని నూనె ఎక్కువైన వంటలో కలపాలి. అప్పుడు ఆ కర్రీలో నూనె తగ్గడమే కాకుండా దాని రుచి కూడా మెరుగుపడుతుంది.

శనగపిండి : మీరు చేసిన ఏదైనా కర్రీ లేదా ఫ్రైలో నూనె అధికంగా ఉంటే.. అప్పుడు శనగపిండిని యూజ్ చేయడం ద్వారా దానిని ఈజీగా తొలగించవచ్చు. అందుకోసం మీరు శనగపిండిని కొద్దిగా వేయించి ఆయిల్ ఎక్కువైన కర్రీ లేదా ఫ్రైలో వేసి కలపాలి. ఆ తర్వాత దానిని కాసేపు మంటపై ఉంచి వేడి చేయాలి. ఇలా చేయడం ద్వారా కూరలోని అదనపు నూనె తగ్గడంతో కర్రీ మరింత క్రిస్పీగా మారుతుంది. అలాగే టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి ఇకపై మీరు ఏదైనా కర్రీ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువైతే టెన్షన్​ పడకుండా.. ఈ టిప్స్ ద్వారా అదనపు నూనెను తగ్గించుకోవడంతో పాటు వంటను మరింత రుచికరంగా మార్చుకోవచ్చు.

వాడేసిన వంట నూనెను వాడుకోండిలా!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.