Best Tips to Clean Iron Dosa Tawa: నాన్ స్టిక్ పెనం కన్నా.. ఇనుప పెనం మీద దోశ(Dosa) వేసుకుని తినడం ఆరోగ్యకరమని కొందరు భావిస్తారు. కానీ.. దాని శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఫలితంగా.. ఐరన్ దోశ ప్యాన్ త్వరగా పాడవుతుంది. అందుకే.. మేం చెప్పే క్లీనింగ్ టిప్స్ పాటించండి.
వాడిన వెంటనే క్లీనింగ్ : ఐరన్ దోశ పెనం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. వాడిన వెంటనే శుభ్రపరచడం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. పెనం కొద్దిగా చల్లారాక క్లీన్ చేయాలి. దానిపై ఉన్న పిండి అవశేషాలు గట్టిపడేవరకు చూడవద్దు. అదేవిధంగా ప్యాన్‌ను శుభ్రం చేయడానికి మృదువైన స్పాంజ్ యూజ్ చేయాలి. గరుకుగా ఉన్నవి వాడితే పెనం ఉపరితలం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
సబ్బు, డిటర్జెంట్లు వాడొద్దు : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఐరన్ దోశ పెనం క్లీన్ చేయడానికి సబ్బు, డిటర్జెంట్లు వాడుతుంటారు. అలా వాడడం మంచిది కాదు. అవి పెనం నాణ్యతను దెబ్బతీస్తాయి. వాటికి బదులుగా.. గోరువెచ్చని నీరు, తేలికపాటి డిష్ సోప్‌లు వాడడం బెటర్. కడిగిన తర్వాత తుప్పు పట్టకుండా ఉండటానికి పెనం పూర్తిగా ఆరబెట్టాలి. ఒకవేళ మొండి ఆహారపు మరకలు ఉంటే.. వాటిని తొలగించడానికి బేకింగ్ సోడా, వాటర్ మిశ్రమంతో సున్నితంగా మెత్తని స్పాంజితో స్క్రబ్ చేయండి. ఆ తర్వాత వాటర్‌తో కడిగి ఆరబెట్టి మెత్తని వస్త్రంతో తుడవండి.
క్రమం తప్పకుండా సీజనింగ్ చేయడం : దోశ పెనం ఎక్కువరోజులు మన్నికగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. క్రమంత ప్పకుండా సీజనింగ్. అందుకోసం మీరు పెనం యూజ్ చేసిన తర్వాత దానికి కాగితపు టవల్ ఉపయోగించి కొద్ది మొత్తంలో నూనె రాయాలి. ఆ తర్వాత ప్యాన్‌ను తక్కువ మంటపై 10-15 నిమిషాలు వేడి చేయాలి. ఈ ప్రక్రియ దాని నాన్ స్టిక్ లక్షణాలను పెంచుతుంది.
ఈ గింజలు కలిపితే.. దోశలు మరింత రుచికరం!
కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడం : ఎక్కువ మంది దోశ పెనం కడిగాక ఆరబెట్టకుండా అలాగే స్టోర్ చేస్తుంటారు. అలా చేయడం ద్వారా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఐరన్ పెనం క్లీన్ చేసినా దానిని పూర్తిగా ఆరబెట్టాలి. అవసరమైతే ఆరబెట్టాక కూడా తడిగా ఉంటే మిగిలిన తేమను తుడిచివేయడానికి మృదువైన వస్త్రం లేదా కాగితపు టవల్ ఉపయోగించండి. అదేవిధంగా మీరు తుప్పు పట్టినట్లు ఏవైనా సంకేతాలను గమనించినట్లయితే.. దానిని తొలగించడానికి ఉప్పు, నూనె మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేయండి. ఆ తర్వాత దానిని పూర్తిగా ఆరేవరకు ఎండబెట్టండి. అలాగే ఇనుప పెనం ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచండి.
టిఫెన్ సెంటర్ ఆదాయం 50 కోట్లు - హైదరాబాద్‌లో గ్రాండ్ ఓపెనింగ్ - 'ఏక్ దోశ' అంటున్న నెటిజన్లు!