ETV Bharat / health

డైలీ వాకింగ్​ చేస్తున్నారా? ఈ టైమ్​లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్​!

When is Walking Better : ప్రస్తుతం చాలా మందికి డైలీ వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అయితే రోజూ వాకింగ్ చేయడం మంచి అలవాటే. కానీ, ఏ టైమ్​లో వాకింగ్ చేస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, రోజులో ఏ టైమ్​లో వాకింగ్ చేస్తే మంచిది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Walking
Best Time to Walk for Good Health
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 12:26 PM IST

Best Time to Walk for Good Health : ఎక్కడైనా, ఎప్పుడైనా చెయ్యటానికి వీలైన, తేలికైన, ఖర్చు అవసరం లేని ఎక్సర్​సైజ్.. వాకింగ్(Walking). అయితే చాలా మందికి వాకింగ్ విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. రోజులో వాకింగ్​ ఎప్పుడు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి? ఉదయం నడక మంచిదా? సాయంత్రం చేసే వాకింగ్ ప్రయోజనకరమా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాస్తవానికి డైలీ వాకింగ్ చేయడం వల్ల మనకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. వాకింగ్​ వల్ల బాడీ ఫిట్​గా మారుతుంది. రోజంతా యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది. బీపీ అదుపులోకి వస్తుంది. బరువును కంట్రోల్​లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అయితే అసలు ప్రాబ్లమ్ ఏంటంటే.. రోజులో ఏ టైమ్​లో వాకింగ్ చేస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి?. అయితే, కొన్ని అధ్యయనాల ప్రకారం.. వేరు వేరు సమయాలలో చేసే వాకింగ్​కు బెనిఫిట్స్ కూడా డిఫరెంట్​గా ఉంటాయని తేలింది. ముఖ్యంగా మార్నింగ్, ఈవెనింగ్ నడక రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింట్లో ఏ వాకింగ్ ద్వారా ఎక్కువ లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇలా నడిస్తే నష్టాలే! వాకింగ్​లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

మార్నింగ్ వాక్ ప్రయోజనాలు : మెజార్టీ పీపుల్ ఎక్కువగా మార్నింగ్ వాక్ చేస్తుంటారు. నిజానికి ఉదయం లేత ఎండలో నడిచే వాకింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల బాడీకి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు, బోన్స్ బలంగా మారడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా బాడీలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీలు త్వరగా బర్న్ అవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవేకాకుండా ఉదయం నడక వల్ల స్లీప్ సైకిల్ మెరుగవుతుందంటున్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్​గా ఉంటారు. వీటితో పాటు ఉదయం వేళ ఉండే ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. శీతాకాలంలో చేసే మార్నింగ్ వాకింగ్ మాత్రం కాస్త ఇబ్బంది కల్గిస్తుందని, చలిగాలుల కారణంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 2014లో జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఉదయం నడక మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు.

ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు : ఇక సాయంత్రం చేసే వాకింగ్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే.. ముఖ్యంగా ఈవెనింగ్ నడక వల్ల రోజంతా ఉండే అలసట, ఒత్తిడి దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. 2010లో జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సాయంత్రం వాకింగ్​ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని కనుగొన్నారు. అదే విధంగా బాడీలోని కండరాలకు తగినంత రెస్ట్ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రాత్రి వేళ మంచి నిద్ర పోయేలా సహకరిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాయంత్రం నడక వల్ల కలిగే ప్రధాన సమస్య వచ్చేసరికి .. పగటిపూట వెలువడే కాలుష్య కారకాలు కారణంగా ఈవెనింగ్ వాక్ చేయడం వల్ల కాలుష్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు. అదే విధంగా సాయంత్రం నడక వల్ల అలసిపోవడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చివరగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకూ సాయంత్రం నడక కంటే ఉదయం వేళ చేసే వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వాకింగ్‌, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్‌ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!

10మందితో వద్దు- సైలెంట్ వాకింగ్ ముద్దు- ఫుల్ హెల్త్ బెనిఫిట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.