ETV Bharat / health

చిన్న పిల్లల జుట్టుకు ఏ నూనె రాస్తున్నారు? - వీటిని ట్రై చేయండి! - which oil is best for baby hair

Best Baby Hair Oils : చిన్నారుల సంరక్షణ సవాలుగా ఉంటుంది. వారి ఎదుగుదలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఈ క్రమంలో వారి జుట్టుకు ఎలాంటి ఆయిల్ వినియోగించాలనేది చాలా మందికి తెలియదు. అయితే.. ఈ హెయిర్ ఆయిల్స్ వాడారంటే మీ బేబీకి చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు!

Baby Hair Oils
Hair Growth
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 12:13 PM IST

Best Oils for Baby's Hair Growth : మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారి జుట్టు పెరుగుదలకు మంచి హెయిర్ ఆయిల్​ను ఎంచుకోవడం చాలా అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే పిల్లల జుట్టు పెరుగుదలకు తోడ్పడే కొన్ని హెయిర్ ఆయిల్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆల్మండ్ ఆయిల్ : ఇది చిన్నారుల జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఇ, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన బాదం నూనె జుట్టు ఆరోగ్యానికి పవర్‌హౌస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నూనెతో మీ చిన్నారి తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే మీ బిడ్డ హెయిర్​ను సిల్కీ స్మూత్​ కండిషన్​లో ఉంచుతుంది. "అన్నల్స్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్" జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎలుకలపై జరిపిన పరిశోధనలో బాదం పప్పులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని వెల్లడైందట.

మగాళ్లలో జుట్టు రాలే సమస్య - మీకు తల స్నానం చేయడం రాకనే!

జోజోబా ఆయిల్ : మీ పిల్లల జుట్టు సంరక్షణకు ఈ ఆయిల్ కూడా మరొక బెస్ట్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు. దీన్ని జోజోబా గింజల నుంచి తయారు చేస్తారు. ఇందులోనూ జుట్టు పెరుగుదలకు తోడ్పడే అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శిశువు నెత్తిమీద పెళుసుగా ఉండే చర్మానికి పోషణనివ్వడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఆలివ్ ఆయిల్ : ఈ ఆయిల్ కూడా పిల్లల జుట్టు సంరక్షణకు మంచిదని చెబుతున్నారు. విటమిన్లు, శక్తివంతమైన కొవ్వు ఆమ్లాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇది జుట్టుకు లోతైన తేమను అందించడమే కాకుండా దానిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్​లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అదేవిధంగా అలివ్ ఆయిల్​ మాయిశ్చరైజింగ్, కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మీ చిన్నారుల జుట్టు పెరుగుదలకు చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అర్గన్ ఆయిల్ : 'లిక్విడ్ గోల్డ్' అని పిలుచుకునే అర్గన్ ఆయిల్ కూడా బేబీ హెయిర్ కేర్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. శిశువు నెత్తిపై క్రమం తప్పకుండా ఈ నూనెను రాయడం వల్ల క్రెడిల్ క్యాప్ తగ్గుతుందట. అలాగే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. ముఖ్యంగా హెయిర్ పెరుగుదలను ప్రోత్సహించి మృదుత్వాన్ని అందిస్తుంది. అదేవిధంగా అర్గాన్ ఆయిల్ పొడి, చిట్లిన జుట్టు ప్రాబ్లమ్స్​ నిరోధించడమే కాకుండా హెయిర్​ను సున్నితంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొబ్బరి నూనె : మనం రెగ్యులర్​గా ఉపయోగించే కొబ్బరి నూనె పెద్దలకు మాత్రమే కాదు చిన్న పిల్లల జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ ఆయిల్​లో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు శిశువుల జుట్టు సంరక్షణకు చాలా బాగా తోడ్పడతాయి. కాబట్టి మీ చిన్నారులకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనె అప్లై చేశారంటే అందులోని పోషకాలు వారి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా వెంట్రుకలను మృదువుగా, బలంగా తయారుచేస్తాయంటున్నారు నిపుణులు.

జుట్టు విపరీతంగా రాలుతోందా? - ఈ అలవాట్లతో చెక్ పెట్టండి​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.