ETV Bharat / health

వేసవిలో చర్మం కమిలిపోతోందా? - ఈ ఫేస్ ప్యాక్​ ట్రై చేశారంటే మెరిసిపోతారంతే!

Face Masks for Sun Tan : వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మానికి చాలా సమస్యలు వస్తాయి. అందులో ప్రధానమైనది ఎండకు చర్మం కమిలిపోవడం. దీనివల్ల ముఖం అందవిహీనంగా తయారవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వారి కోసం బెస్ట్ ఫేస్ ప్యాక్​లు తీసుకొచ్చాం!

Face Masks for Sun Tan
Sun Tan
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 3:34 PM IST

Sun Tan Remove Face Masks : సన్​ టాన్ ప్రాబ్లం తొలగించడంలో నిమ్మరసం ప్యాక్ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మార్చడంలో చాలా సహాయపడతాయి. ఇక దీనిని ఎలా సిద్ధం చేసుకోవాలంటే.. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని దానికి కొంచెం చక్కెర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మీ ఫేస్​కి అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై వాటర్​తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

వేసవిలో జిడ్డు చర్మం, మొటిమలతో ఇబ్బందులా? ఈ టిప్స్ మీకోసమే!

పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ : టాన్‌ను తొలగించే అత్యంత ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్‌లలో ఇది కూడా ఒకటి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడమే కాకుండా ఫేస్​ గ్లోను పెంచుతుందంటున్నారు నిపుణులు. అలాగే సన్​ టాన్‌ తొలగిస్తుందని చెబుతున్నారు. పసుపులోని సహజ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయంటున్నారు. ఇక ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా ఒక బౌల్​ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పేస్ట్​లా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఫేస్​కు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

శనగపిండి, పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ : ఇది కూడా సన్​ టాన్ తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. శనగపిండి చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే.. దీనిని ఎలా సిద్ధం చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగుతో పాటు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని మెత్తని పేస్ట్​లా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి అది పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచాలి. అనంతరం కూల్ వాటర్​తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఈ ఫేస్ ఫ్యాక్​లతో ఆరోగ్యవంతమైన, అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

యాపిల్​ పేస్టుతో..

తొక్క తీసిన యాపిల్‌ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక కప్పులో తీసుకొని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బార్లీ పిండిని కలపాలి. కలిపిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కొద్ది నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. యాపిల్, బార్లీ పిండి.. వీటికి బదులుగా బియ్యప్పిండి, బంగాళాదుంపలను కూడా ఉపయోగించవచ్చని కాస్మొటాలజిస్ట్ శైలజ సూరపనేని తెలిపారు.

Summer Skin Care : హాట్ సమ్మర్​లో.. అందం కోసం కూల్ కూల్​గా ఫ్రూట్ మాస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.