Best Foods for Hair Growth : ఈరోజుల్లో చాలా మందిని జుట్టు రాలిపోయే సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా నేటి యువతకు ఇది చెప్పుకోలేని బాధ, తీరని వ్యథగా మారింది. మరి మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? చేతులతో తాకితేనే ఊడుతోందా? అందుకు వంశపారంపర్యం, నిద్రలేమి, ఒత్తిడి.. ఇలా అనేక కారణాలుండొచ్చు. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు తినే ఆహారంలో జింక్ లోపించడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని జింక్(Zinc) సమృద్ధిగా ఉండే ఫుడ్స్ కూడా సూచిస్తున్నారు. వాటిని తినడం వల్ల అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌కి ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు బలంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని చెబుతున్నారు. ఇంతకీ, ఆ జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గుడ్డు : దీనిలో జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ జుట్టు రాలడాన్ని నివారించి, వెంట్రుకల పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీ డైట్లో గుడ్డును చేర్చుకున్నారంటే ఇవి రెండూ ఒకేసారి పొందవచ్చుంటున్నారు. ఫలితంగా జుట్టుకు చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
పాల పదార్థాలు : వీటిని తీసుకోవడం ద్వారా కూడా జింక్ సమృద్ధిగా లభిస్తోంది. ముఖ్యంగా పాలు, చీజ్‌లో జింక్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
నట్స్ : ఇవి కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పైన్ నట్స్ వంటివి అధిక మొత్తంలో జింక్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ నట్స్.. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఇతర అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడతాయి.
నువ్వులు : ఈ గింజలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో విటమిన్లు, మినరల్స్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.
జుట్టు సమస్యలన్నీ క్లియర్ - ఈ నేచురల్ ఆయిల్స్ గురించి తెలుసా?
తృణధాన్యాలు : గోధుమలు, క్వినోవా, బియ్యం, ఓట్స్ వంటి కొన్ని ధాన్యాలలో కూడా జింక్ అధికంగా ఉంటుంది. అలాగే తృణధాన్యాలలో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ లభిస్తాయంటున్నారు నిపుణులు.
గుమ్మడి విత్తనాలు : ఈ గింజల్లో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలతో పాటు విటమిన్ ఎ, బి, సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే జింక్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇవనీ జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడుతాయి. 2019లో US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గుమ్మడి గింజల్లోని సంతృప్త, అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడం తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుందని తేలింది.
ఇవేకాకుండా డార్క్ చాక్లెట్, షెల్ఫిష్, మాంసం, కొన్ని రకాలు పప్పులు, కూరగాయలు, పండ్లను మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా బాడీకి తగిన మొత్తంలో జింక్ లభించడమే కాకుండా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మీ డైట్లో జింక్ రించ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా మీ హెయిర్ ఒత్తుగా, ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? ఈ ఫ్రూట్స్ తీసుకుంటే చాలు