ETV Bharat / health

మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా? - నిపుణులు సూచిస్తున్న బ్రీతింగ్ వ్యాయామాలు ఇవే! - Exercises for Healthy Lungs - EXERCISES FOR HEALTHY LUNGS

Best Exercises for Healthy Lungs : హాయిగా ఊపిరి పీల్చుకోవడం మన ఆరోగ్యానికి మొదటి మెట్టు. అయితే.. పలు రకాల కారణాలతో ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి వారు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు చేయాలని, అవి లంగ్స్ ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Breathing Exercises for Lungs Health
Best Exercises for Healthy Lungs (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 15, 2024, 10:39 AM IST

Updated : Sep 18, 2024, 1:49 PM IST

Breathing Exercises for Lungs Health : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. ఊపిరితిత్తులు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ.. పలు కారణాలతో వాటిలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పలు శ్వాస వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎక్కువ పొల్యూషన్ ప్రాంతాలలోకి వెళ్తే తప్పనిసరిగా మాస్క్​లు వాడాలని అంటున్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ TLN స్వామి. అదేవిధంగా బాణసంచా పొగకు దూరంగా ఉండాలట. అన్నింటికంటే ముఖ్యంగా ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా.. లంగ్స్​ని ప్రొటెక్ట్ చేయడంతోపాటు వాటి కెపాసిటీ పెంచే ప్రయత్నం చేయాలంటున్నారు. అందుకోసం.. డైలీ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు ప్రాక్టీస్ చేయాలంటున్నారు. ఇవి చేయడం ద్వారా ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ పెరగడమే కాకుండా లంగ్స్​కి మంచి ఎనర్జీ దొరుకుతుందని చెబుతున్నారు.

బ్రీతింగ్ : ఇది లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం ముందుగా నేలపై నడుముని వంచకుండా స్ట్రెయిట్​గా కూర్చోవాలి. ఆపై గాలిని పీల్చి మీ స్టమక్ మజిల్స్​ని రిలాక్స్ చేయాలి. పొట్టను వీలైనంత వరకూ గాలితో నింపే ప్రయత్నం చేయాలి. చెస్ట్ కూడా గాలితో నిండేవరకూ ఇలానే చేయాలి. కాసేపు గాలిని బెల్లీ, చెస్ట్‌తో నింపి ఆ తర్వాత మెల్లిగా వదలాలి. ఇలా మీకు వీలైనంత సేపు డైలీ ప్రాక్టీస్ చేయాలి.

డయాఫ్రమెటిక్ బ్రీతింగ్ : ఈ వర్కౌట్ కూడా లంగ్స్​ను హెల్దీగా ఉంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని NIH బృందం కూడా వెల్లడించింది. (National Cancer Institute రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఈ వ్యాయామం చేయడానికి.. ముందుగా నేలపై కూర్చొని మీ రెండు చేతులలో ఒక హ్యాండ్​ని పొట్ట మీద మరో దాన్ని ఛాతీపై ఉంచాలి. ఆపై ముక్కుతో గాలిని తీసుకోవాలి. అప్పుడు మీ ఉదరభాగం పెరుగుతున్నట్లుగా అనిపించాలి. కానీ, ఛాతీ మాత్రం స్థిరంగా ఉండాలి. అలా కాసేపు ఉండి తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా గాలిని రిలీజ్ చేయాలి. ఇలా రోజూ మీకు వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి.

డీప్ బ్రీతింగ్ : ఇందుకోసం ముందుగా నేలపై సరిగ్గా కూర్చోవాలి. ఆ తర్వాత ముక్కుతో గాలిని పీల్చుకుంటూ వీలైనంత వరకు పొట్టను నింపాలి. కొద్దిసేపు అదే పొజిషన్​లో ఉండి ఆపై మెల్లిగా నోటితో గాలిని వదలాలి. ఇలా మీకు వీలైనన్ని సార్లు చేయాలి.

లయన్ బ్రీత్ : దీని కోసం నేలపై కూర్చొని నోటిని తెరిచి నాలుకని బయటికి పెట్టి శబ్జం చేస్తూ ఊపిరి పీల్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా గొంతు, ఛాతీ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే శ్వాసక్రియ రేటు మెరుగవుతుంది.

నోటి నుంచి గాలి వదలడం : ఇందుకోసం ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత ముక్కు ద్వారా గాలిని తీసుకోవాలి. ఆపై పెదాలని విజిల్ వేసినట్టుగా ఉంచి నోటి నుంచి గాలి వదలాలి.

ఇలా మీరు డైలీ బ్రీతింగ్ వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ లంగ్స్ కెపాసిటీ పెరగడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు, లంగ్ క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్ TLN స్వామి. అంతేకాదు.. ఒత్తిడి, మానసిక ఆందోళనలు దరిచేరకుండా ఉంటాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహారం తప్పనిసరి!

అలర్ట్ : పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ - ఇవి చెక్​ చేసుకోండి!

Last Updated : Sep 18, 2024, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.