ETV Bharat / health

హైబీపీతో బాధపడుతున్నారా? - రోజూ ఈ ఆహారాలు తింటే దెబ్బకు నార్మల్​కి వచ్చేస్తుందట! - BLOOD PRESSURE CONTROL FOODS

అధిక రక్తపోటు ఆరోగ్యానికి హానికరం - డైలీ డైట్​లో ఈ మార్పులు చేసుకుంటే బీపీ కంట్రోల్ అంటున్న నిపుణులు!

BLOOD PRESSURE CONTROL FOODS
Diet for Blood Pressure Control (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 3:36 PM IST

Best Diet for Blood Pressure Control : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బీపీ అదుపులో ఉండేందుకు మందులు వాడడంతో పాటు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తుంటారు. అయినా కొందరిలో రక్తపోటు కంట్రోల్​లో ఉండదు. అందుకే బీపీ అదుపు​లో ఉండాలంటే.. వాటిని ఫాలో అవ్వడమే కాకుండా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు హైపీతో బాధపడుతున్నట్లయితే ముందుగా మీ శరీర అవసరాలని గుర్తించి అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటూ.. వ్యాయామాలూ చేస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించొచ్చంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అందులో భాగంగా డైలీ ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే.. హెల్దీగా ఉన్న సాధారణ వ్యక్తికి రోజూ చెంచా ఉప్పు తీసుకుంటే సరిపోతుందట. దీంతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలూ శరీరానికి అందేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా.. ఆహారంలో మేలైన కొవ్వుల మోతాదుని పెంచుకోవడంతో పాటు విటమిన్‌ ఇ, సి, సెలీనియం, జింక్‌ వంటివి కూడా తగిన మొత్తంలో అందేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ఇవే కాకుండా రోజువారి తీసుకునే ఆహారంలో ఫోలిక్‌ యాసిడ్, ఫైటోకెమికల్స్‌ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇవి రక్తాన్ని చిక్కబడనివ్వకుండా కాపాడతాయంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. పొట్టుతో ఉన్న గింజధాన్యాలతో పాటు కాయగూరలు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే, రోజూ కనీసం ముప్పై గ్రాముల నూనెగింజలు, నట్స్‌ తినేలా చూసుకోవాలంటున్నారు.

"బీపీ" చెక్‌ చేయించుకోవడానికి వెళ్తున్నారా? - ఈ పొరపాట్లు చేస్తే మీ లెక్కలు తారుమారు!

నూనె ఎక్కువగా తీసుకోవద్దు!

బీపీ అదుపులో ఉండాలంటే నూనెను ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలంటున్నారు. రోజుకి నాలుగైదు చెంచాలకు మించి నూనె వాడకూడదట. అందులోనూ రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ ఉడికించని ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్స్‌, నాటుకోడి, చేప తినొచ్చని చెబుతున్నారు. అలాగే రోజువారి ఆహారంలో కాల్షియం ఫుడ్ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అధికరక్తపోటుని అదుపులో ఉంచడానికి తోడ్పడుతుందంటున్నారు.

వ్యాయామం తప్పనిసరి!

రక్తపోటు కంట్రోల్​ ఉండాలంటే ఆహారపు అలవాట్ల మీద దృష్టిపెట్టడంతో పాటు బరువునీ అదుపులో ఉండేలా జాగ్రత్తపడాలి. అలాగే ఒత్తిడినీ నియంత్రించుకోవాలి. వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడమూ తప్పనిసరి అంటున్నారు. ఈ అలవాట్లన్నీ అధికరక్తపోటుని రానివ్వవని.. వచ్చినా ఇతర అనారోగ్యాలకు కారణం కానివ్వవని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

క్లారిటీ: బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? - తగ్గడానికి ఏం చేయాలి? - నిపుణుల ఆన్సర్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.