Benefits of Eating Anjeer soaked in Milk : కొలెస్ట్రాల్ కరిగించాలంటే అంజీరాను పాలతో కలిపి తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాలలో నానబెట్టి తింటే.. కేవలం కొలెస్ట్రాల్ కరగడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయని అంటున్నారు. అంజీరాలో విటమిన్ ఎ, విటమిన్ బి1 (థయామిన్), విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి3 (నియాసిన్), విటమిన్ బి6, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ ఎలా కరుగుతుందంటే.. అత్తిపండ్లలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. దీనినే పెక్టిన్ అని పిలుస్తారు. అంజీరాను పాలలో నానబెట్టి తినడం వల్ల.. అందులోని పెక్టిన్ ఒక జెల్ లాంటి పదార్థంగా మారి.. పేగుల గోడలకు అంటుకుంటుందని.. తద్వారా శరీరం కొలెస్ట్రాల్‌ను శోషించకుండా(Absorption) నిరోధిస్తుందని అంటున్నారు. 2008లో "Nutrition Research" లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 4 వారాల పాటు రోజుకు 5 అత్తిపండ్లను పాలలో నానబెట్టి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని యేదిటెప్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరోసర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ M. Ozgen పాల్గొన్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పాలలో ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అంజీరాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: అంజీరాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. పాలలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
ఎముకల ఆరోగ్యానికి మంచిది: పాలలో కాల్షియం, విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అంజీరాలలో కూడా కాల్షియం, పొటాషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో, అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే - ఆరోగ్యానికి మంచిదేనా?
రక్తపోటును నియంత్రిస్తుంది: పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని.. అంజీరాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుందని.. ఇది రక్తపోటు ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మంచిది: అంజీరాలలో ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచివని.. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: నేచురల్‌గానే కొద్దిగా స్వీట్‌గా ఉండే అంజీరాలను షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడేవారు పాలలో నానబెట్టిన అంజీరాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు.
నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది: అంజీరాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మెలటోనిన్.. నిద్రను ప్రేరేపించే హార్మోన్. పాలు కూడా ట్రిప్టోఫాన్‌కు మంచి మూలం. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి సహాయపడుతుందని అంటన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి:
వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతుంటాయ్ - కాటేస్తే వెంటనే ఇలా చేయండి!