ETV Bharat / health

తిన్న తర్వాత - తాగుతున్నారా? - Herbal Tea Benefits

Benefits Of Drinking Herbal Tea After Meal : కొంత మంది భోజనం చేసిన తర్వాత హెర్బల్‌ టీ తాగుతుంటారు. మరి.. ఇలా తాగడం మంచిదేనా? తాగితే ఏమవుతుంది?? మీకు తెలుసా???

Benefits Of Drinking Herbal Tea After Meal

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 10:52 AM IST

Benefits Of Drinking Herbal Tea After Meal : మనలో చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్‌ తినాలని ఉంటుంది. అలాగే.. ఇంకొంత మందికి ఏదైనా పండు తినాలని అనిపిస్తుంది. ఎవరి ఇష్టాలు, అభిరుచులు వారికి ఉంటాయి. అయితే.. భోజనం చేసిన తర్వాత హెర్బల్‌ టీ తాగుతుంటారు కొందరు! మరి.. ఇలా తిన్న తర్వాత హెర్బల్ టీ తాగడం మంచిదా? ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?

భోజనం తర్వాత హెర్బల్ టీ తాగితే ఏమవుతుంది?
తిన్న తర్వాత ఏదైనా హెర్బల్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల.. ప్రతి ఒక్కరూ భోజనం తర్వాత ఒక కప్పు హెర్బల్ టీ తాగడం మంచిదని అంటున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : భోజనం తర్వాత హెర్బల్‌ టీని తాగడం వల్ల చక్కటి ఫలితాలు పొందొచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత అల్లం టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేస్తుందని తెలియజేస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హాని కలిగించే ప్రీ రాడికల్స్‌తో పోరాడుతాయట. ఇంకా ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులనూ తరిమికొట్టవచ్చని అంటున్నారు.

హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: కొంత మందికి నీటిని ఎక్కువగా తాగడం ఇష్టం ఉండదు. ఇలాంటి వారు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి హెర్బల్‌ టీలను తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో నీరు తగినంత ఉంటుందని అంటున్నారు.

కడుపు ఉబ్బరం తగ్గుతుంది: భోజనం తర్వాత హెర్బల్‌ టీని తాగడం వల్ల కొంత రిఫ్రెష్‌గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించేలా చేస్తుందని అంటున్నారు.

హెర్బల్ టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు:

  • సన్నగా తరిగిన లెమన్ గ్రాస్ వేర్లు
  • దాల్చిన చెక్క - చిన్నది
  • యాలకులు - ఆరు
  • అల్లం - చిన్న ముక్క
  • నీరు - రెండు కప్పులు
  • బెల్లం - ఒక టీ స్పూన్ (కావాలనుకుంటేనే)
  • లెమన్ గ్రాస్ లేకపోతే కరివేపాకు, తులసి ఆకులతో కూడా ఈ హెర్బల్‌ టీ తయారు చేసుకోవచ్చు.

తయారు చేసే విధానం:

  • ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి బాగా మరిగించండి
  • ఇప్పుడ లెమన్ గ్రాస్ వేర్లు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం చిన్న రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి నీళ్లలో వేయండి
  • ఆ నీటిని రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించండి
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టండి
  • అంతే.. హెర్బల్‌ టీ రెడీ అయిపోతుంది.
  • కావాలనుకుంటే.. ఇందులోకి బెల్లం కూడా కలుపుకోవచ్చు.

టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగొచ్చా? కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందా?

మీ మానసిక ఒత్తిడికి - మీ గట్ సిస్టమే కారణం కావొచ్చని తెలుసా?

జొన్నరొట్టెలు చేయడం రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీగా ​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.