ETV Bharat / health

మెట్లు ఎక్కడం వల్ల ఇన్ని ప్రయోజనాలా! తెలిస్తే అసలు లిఫ్ట్​ వైపే చూడరు!! - Stair Climbing Benefits

Benefits Of Climbing Stairs Daily : ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా, షాపింగ్ మాల్స్, థియేటర్స్​కు ఇలా ఇక్కడికైనా వెళ్లినప్పుడు పై అంతస్తులకు వెళ్లేందుకు మెట్ల దారిని వదిలి లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉపయోగిస్తాం. అయితే ఎప్పుడూ వీటినే ఉపయోగించకోవడ వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ మెట్ల ఎక్కి వెళ్లడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

STAIR CLIMBING BENEFITS
STAIR CLIMBING BENEFITS (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 10:15 AM IST

Benefits Of Climbing Stairs Daily : మీరు ఉండే అపార్టుమెంటులో లేదా పనిచేసే ఆఫీసులో తప్పకుండా మెట్లు ఉండే ఉంటాయి. కానీ సమయం లేకనో, ఓపిక లేకపోవడం వల్లనో మీరు మెట్లు ఎక్కకుండా లిఫ్టులో వెళ్తున్నారా? అలా అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే. వాస్తవానికి మెట్లు ఎక్కడం చాలా మందికి సులువైన పని. కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. ప్రతి రోజూ మెట్లు ఎక్కడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా రకాలుగా మెరుగవుతుందట. ప్రతి రోజూ మీరు చేసే వ్యాయామం లాగా మెట్లు ఎక్కే అలవాటు కూడా మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెట్ల దారిలో వెళ్లడం వల్ల కలిగే మేలు గురించి తెలిస్తే, ఇప్పటి నుంచి మీరే మెట్లను వెతుక్కుని మరీ ఎక్కుతారని చెబుతున్నారు నిపుణలు. ఇంకెందుకు ఆలస్యం లిఫ్టులో వెళ్లడం ద్వారా మీరు ఏమేం కోల్పోతున్నారో తెలుసుకుందాం.

గుండెకు మంచిది
మెట్లు ఎక్కడం వల్ల గుండెకు మంచి వ్యాయామం అందుతుంది. ఈ అలవాటు మీ గుండెకు రక్త సరఫరాను పెంచి హార్ట్ ఎటాక్, గుండె సమస్యలు వంటివి రాకుండా కాపాడుతుంది.

కండరాలను బలపరుస్తుంది
బరువులు మోస్తే కండరాలు ఎలా బలంగా తయారవుతాయి. అలాగే మెట్లు ఎక్కడం వల్ల తొడల నుంచి మోకాళ్లు, కీళ్లు, పాదాల వంటి నడుము కింది భాగంలోని అన్ని కండరాలు బలంగా మారతాయి.

బరువు తగ్గుతారు
మెట్లు ఎక్కడం వల్ల కేలరీలు ఇట్టే కరిగిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి.

ఓర్పు పెరుగుతుంది
ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల శారీరక సామర్థ్యంతో పాటు ఓర్పు పెరుగుతుంది. మెట్లు ఎక్కే అలవాటు ఉన్నవారిలో సమతుల్యత, సమన్వయం మెరుగ్గా కనిపిస్తాయి. శారీరకంగా, మానసికంగా మీరు ఎల్లప్పుడూ ఫిట్​గా ఉండాలంటే మెట్లు ఎక్కడం అలవాటుగా చేసుకోవాలి.

ఎముకల ఆరోగ్యం
మెట్లు ఎక్కడం, బరువు మోసే పనులు చేయడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరిగి బలంగా తయారవుతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాలు తగ్గడం, శారీరకంగా పుష్టిగా, బలంగా తయారవుతారు.

మానసిక స్థితి
శారీరక శ్రమ అనేది శరీరంలో ఎండార్ఫిన్లు, న్యూరోట్రాన్సిమిటర్లను విడుదల చేస్తుంది. ఇది మానసికంగా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతుంది. ప్రతి రోజూ కనీసం రెండు లేదా మూడు ఫోర్ల మెట్టు ఎక్కడం వల్ల ఒత్తిడిని తగ్గి ఆనందంగా ఉంటారు.

శక్తి మెరుగవుతుంది
మెట్టు ఎక్కడం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. కణజాలాలకు ఆక్సిజన్ పంపిణీని మెరుగుపరిచి శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది. ఫలితంగా అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు- స్మూతీ హెయిర్ గ్యారెంటీ! - Eggs For Hair Health

కడుపు నిండా తిన్న తర్వాత అలా చేస్తున్నారా? అయితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! - Things Not To Do After Eating

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.