ETV Bharat / health

షుగర్​ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే? - Bananas For Diabetes Patients

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 4:56 PM IST

Bananas For Diabetes Patients : అరటిపండు తినడం వల్ల చాలా ప్రమోజనాలు ఉంటాయి. అరటిపండు ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, పొటాషియం, రాగి వంటి అనేక పోషకాల నిధి. అయితే అరటిపండు తియ్యగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు దీనిని తినొచ్చా? అని చాలా మందిలో అనుమానం ఉంటుంది. మరి షుగర్ ఉన్నవారు అరటిపండు తినొచ్చో లేదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bananas For Diabetes Patients
Bananas For Diabetes Patients

Bananas For Diabetes Patients : ప్రస్తుతం భారత్​ను పట్టిపీడిస్తున్న సమస్య డయాబెటిస్(షుగర్). మనదేశంలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నందువల్ల ఇండియాను 'డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్' అని పిలుస్తున్నారు. ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యంగా, జీవనశైలి మార్పులు వల్ల డయాబెటిస్ (మధుమేహం) వస్తుంది. సిటీ, పల్లె అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఒక డయాబెటిస్ పేషెంట్ ఉండేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. అయితే, డయాబెటిస్​ను అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది అన్నం తగ్గించడమో, స్వీట్స్ తినడమో మానేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు మానాల్సింది ఏంటి? ఎంత వరకూ, ఏమేం తినాలి? అనే దానిపై అవగాహన లేకుండా చేస్తే అసలుకే మోసం అని తెలుసుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవారు అరటి పండును తినొచ్చా అని చాలా మంది అనుమానం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అరటిపండు తియ్యగా ఉంటుంది, అది తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయని భావిస్తుంటారు. వాస్తవానికి డయాబెటిస్ పేషెంట్లకు అరటిపండు చాలా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా అధికంగా కాకుండా కొద్దిగా తీసుకోవటం మంచిది అని సూచిస్తున్నారు.

వారు మాత్రం దూరంగా ఉండాలి
అరటిపండ్లలో స్వీట్‌నెస్‌తో పాటు కార్బొహైడ్రేట్స్ కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. షుగర్​కు కారణమైన గ్లెసెమిక్ ఇండెక్స్ అరటిపండ్లలో చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల మధుమేహ పేషెంట్లకు ఎటువంటి హానీ కలగదు. రోజూ ఒక మీడియం సైజ్ అరటిపండు తీసుకోవడం మంచిదేనట. కానీ, షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లు మాత్రం అరటిపండుకు దూరంగా ఉండాలి. ఒకవేళ వారు కూడా తినాలని అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. పండిన దానికంటే పచ్చి అరటిపండు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. స్వీట్ నెస్ తక్కువ ఉండటం వల్ల బ్లడ్ షుగర్​లో ఎటువంటి మార్పులు కలగవని, ఇంకా షుగర్‌ చాలా కాలం అదుపులో కూడా ఉంటుందని వైద్యులు తెలిపారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జలుబు, దగ్గుకు 'వాము' బెస్ట్ మెడిసన్- ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! - vamu health benefits

అవుట్​డోర్ vs ట్రెడ్​మిల్​ - వాకింగ్ చేయడానికి ఈ రెండిట్లో ఏది మంచిది? - Outdoors Vs Treadmill for Walking

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.