ETV Bharat / health

తీపి ఎక్కువగా తింటున్నారా? - ఇలా చెక్‌ పెట్టండి!

Ayurvedic Foods To Stop Eating Sugar Items : మీరు తరచూ చక్కెర ఎక్కువగా స్వీట్లు, కూల్‌ డ్రింక్స్ వంటివి తీసుకుంటున్నారా? ఎంత ట్రై చేసినా కూడా ఈ అలవాటును మానలేకపోతున్నారా? అయితే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ కోరికలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Ayurvedic Foods To Stop Eating Sugar Items

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 10:57 AM IST

Ayurvedic Foods To Stop Eating Sugar Items : చాలా మంది సరైన సమయానికి భోజనం చేయరు. దీంతో.. ఆ తర్వాత ఎప్పుడో ఆకలి వేస్తుంది. ఆ సమయానికి ఎక్కడో ఉంటారు. ఫలితంగా.. బయట దొరికే కూల్‌ డ్రింక్స్‌, కేక్స్‌, కూకీస్‌ వంటివి తింటుంటారు. వీటిల్లో షుగర్ ఎక్కువ. ఇలా తరచూ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. వాటిని తినకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే.. ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయ :
కాకరకాయ తినడం వల్ల తీపి పదార్థాలు తినాలనే కోరికలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులంటున్నారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్‌ వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. కాకరకాయలను తినడం వల్ల కఫ దోషం తగ్గుతుందట. ఇందులో ఉండే చేదు లక్షణాలు తీపి తినాలనే కోరికలను తగ్గిస్తాయని తెలియజేస్తున్నారు.

మెంతులు :
స్వీట్లు ఎక్కువగా తినాలనే కోరికలు కలిగే వారు మెంతులను తీసుకోవడం వల్ల ఆ ఆలోచనలు తగ్గుతాయట. రాత్రి పడుకునే ముందు కొన్ని మెంతి గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. 2014 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు 8 వారాల పాటు రోజుకు 1 గ్రాము మెంతుల పొడిని తీసుకున్నారు. దీనివల్ల వారిలో తీపి పదార్థాలు తినాలనే కోరికలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.

త్రిఫల :
చక్కెర పదార్థాలను ఎక్కువగా తినాలనే కోరిక కలిగిన వారు ఆయుర్వేద మూలిక త్రిఫలను తీసుకోవడం వల్ల ఆ కోరికలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులంటున్నారు. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. 2012 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు 12 వారాల పాటు రోజుకు 2 గ్రాముల త్రిఫల పొడిని తీసుకున్నారు. దీనివల్ల వారిలో తీపి పదార్థాలు తినాలనే కోరికలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు.

పసుపు :
రోజువారీ ఆహార పదార్థాలలో మనం వేసుకునే పసుపు కూడా తీపి కోరికలను తగ్గిస్తుందట. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ వంటి వాటిని తినాలనే కోరికలు తగ్గుతాయట.

అశ్వగంధ :
ఎన్నో ఏళ్ల నుంచి ఆయుర్వేదంలో అశ్వగంధ మూలికకు ప్రాధాన్యం ఉంది. దీన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులంటున్నారు. అలాగే ఇది ఎన్నో రకాల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. దీన్ని ఒత్తిడి, ఆందోళన, తీపి పదార్థాలు తినాలనే కోరికలను తగ్గించుకోవడానికి టీ లాగా తయారు చేసుకుని తీసుకోవాలని తెలియజేస్తున్నారు.

అలోవెరా :
ఆయుర్వేదం ప్రకారం అలోవెరా మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల పుల్లగా, కారం మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనే కోరికలు తగ్గుతాయట.

సోంపు :
మనందరికీ ఆహారం తీసుకున్న తర్వాత ఏదైనా తీపి తినాలనే కోరిక సహజంగానే కలుగుతుంటుంది. అయితే, ఈ కోరికలను తగ్గించుకోవడానికి కొద్దిగా సోంపు గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆ ఆలోచనలు తగ్గుతాయట.

మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే మీ బాడీలో ఆ సమస్య ఉన్నట్టే!

దంతాల్లో రక్తమా? గుండెకు ముప్పు! - ఈ అలవాట్లు ఫాలో కావాల్సిందే!

బాణపొట్టతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాటర్​ తీసుకుంటే ఇట్టే కరిగిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.